Political News

చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి కొలువు

కృష్ణా జలాల పంపకం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వాడీవేడీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకేమాట మీద ఉన్నారు. జలజగడాలు వద్దని…చర్చలతో సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పారు.

మరోపక్క చంద్రబాబుకు రేవంత్ రెడ్డి కొలువునిచ్చారు. అంతేకాదు, అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని కూడా స్వయంగా చంద్రబాబుకు రేవంత్ అందజేశారు. అయితే, ఆ చంద్రబాబు… ఏపీ సీఎం చంద్రబాబు కాదు. ఇటీవల గ్రూప్-3 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఉద్యోగంలో చేరబోతున్న చంద్రబాబు.

గ్రూప్-3లో అర్హత సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అనే అభ్యర్థి పేరును వ్యాఖ్యాత పిలవగానే శిల్పకళావేదికలో నవ్వులు పూచాయి.

రేవంత్ తో పాటు వేదిక మీద ఉన్నా నాయకులంతా చిరునవ్వులు చిందించారు. చంద్రబాబు పేరు పెట్టుకున్న ఓ అభ్యర్థికి నియామక పత్రాన్ని చిరునవ్వుతో రేవంత్ అందించారు. ఆ అభ్యర్థి వెన్ను తట్టి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దానిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. చంద్రబాబుకు రేవంత్ కొలువు ఇచ్చారని సరదాగా కొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా, రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రూప్ 1,2,3 వంటి ఉద్యోగాలను ఒక బాధ్యతతో ఎలాంటి తప్పులు లేకుండా భర్తి చేశామని వెల్లడించారు.

ప్ర‌శ్న ప‌త్రాల‌ను గత ప్రభుత్వం ప‌ల్లీ బ‌ఠానీల్లా అమ్మిందని, అయినా సరే బీఆర్ఎస్ నేతలకు చీమ‌కుట్టిన‌ట్లైనా లేద‌ని ఎద్దేవా చేశారు. యూపీఎస్సీ ని ప‌రిశీలించి టీజీపీఎస్సీ ని ప్రక్షాళన చేశామ‌న్నారు. గ్రూప్-3 నియామక పత్త్రాలు ఇవ్వొద్దని ఎన్నో కుట్రలు చేశారని అన్నారు. అయినా సరే అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. కోర్టులలో కొట్లాడి ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.

This post was last modified on January 17, 2026 4:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సంగారెడ్డికి జగ్గారెడ్డి గుడ్ బై!

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు…

30 minutes ago

ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించారు

తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు సింగిల్ స్క్రీన్ల మనుగడే ప్రమాదంలో పడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేరున్న ఒక్కో సింగిల్ స్క్రీన్ మూత…

2 hours ago

అయిదో రోజూ ఆగని వర ప్రసాదు

కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్ల సమస్య వల్ల థియేటర్లు సరిపోకపోయినా, మరో నాలుగు సినిమాలతో స్క్రీన్లు పంచుకోవాల్సి వచ్చినా మన శంకరవరప్రసాద్…

3 hours ago

జనం నాడి పట్టుకున్న కూటమి.. పండుగ పూట ఖుషీ..!

ఏ ప్రభుత్వమైనా పట్టు విడుపులు ఉండాలి. అప్పుడే ప్రజలు హర్షిస్తారు. అన్నీ చట్టం ప్రకారమే చేయాలంటే ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి.…

3 hours ago

గెలిస్తే సిటీ బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణం

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఆకర్షణీయమైన హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి…

4 hours ago

హుక్ స్టెప్ క్రెడిట్ చిరుదేనా?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఈ సంక్రాంతికి చిరస్మరణీయమే. చిరు కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర…

4 hours ago