ప్రపంచానికి పెద్దన్నగా.. సూపర్ పవర్ గా.. అగ్రరాజ్యంగా అమెరికాను అభివర్ణిస్తారు. అయితే.. ప్రపంచంలోనే పవర్ ఫుల్ పాస్ పోర్టు ర్యాంకులో మాత్రం అగ్రరాజ్యం టాప్ స్థానంలో ఉండటం తర్వాత.. టాప్ 5లో కూడా ఉండని పరిస్థితి. ఇంతకూ పాస్ పోర్టు పవర్ ఫుల్ గా ఉంటే లాభమేంటి? అంటారా? ఏ పాస్ పోర్టు అయితే బలంగా ఉంటే..వీసా పంచాయితీతో సంబంధం లేకుండా పలు దేశాలకు ఇట్టే తిరిగేయొచ్చు. వివిధ దేశాలకు పాస్ పోర్టు ర్యాంకింగ్ ఇచ్చే సంస్థల్లో పేరున్న సంస్థ హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్.
తాజాగా విడుదల చేసిన ఇండెక్స్ లో సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ పాస్ పోర్టుగా నిలిచింది. ఈ దేశం పాస్ పోర్టు ఉన్న వారు ప్రపంచంలోని 192 దేశాలకు ఎలాంటి వీసాలతో సంబంధం లేకుండా ఇట్టే పర్యటించే వీలుంది. అంత శక్తివంతమైన పాస్ పోర్టుగా నిలిచింది. తర్వాతి స్థానంలో జపాన్..దక్షిణ కొరియాలు నిలిచాయి. ఈ రెండు దేశాల పాస్ పోర్టు ఉంటే ప్రపంచంలోని 188 దేశాలకు వీసాలతో సంబంధం లేకుండా ప్రయాణించొచ్చు.
మూడో స్థానంలో డెన్మార్క్.. లక్సెంబర్గ్.. స్పెయిన్.. స్వీడన్.. స్విట్జర్లాండ్ దేశాలు నిలిచాయి. ఇవన్నీ యూరోప్ కు చెందిన దేశాలే కావటం గమనార్హం. ఈ దేశాల పాస్ పోర్టు ఉన్న వారు 186 దేశాల్లో వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని పొందే వీలుంది. ప్రపంచంలోనే అతి తక్కువ పవర్ ఉన్న పాస్ పోర్టు గా అప్ఘాన్ నిలుస్తుంది. ఈ దేశం పాస్ పోర్టు ఉంటే కేవలం 24 దేశాలకు మాత్రమే వీసా అవసరం లేకుండా ప్రయాణించే వీలుంది. పొరుగున ఉండే పాక్ విషయానికి వస్తే.. తాజా రిపోర్టులో ఆ దేశం 98వ ర్యాంకులో నిలిచింది.
మరి..భారత్ మాటేంటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఆసక్తికర అంశం కనిపిస్తోంది. ప్రతి ఏటా ఇచ్చే ర్యాంకుల్లో.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత ర్యాంకు మెరుగుపడింది. 2025లో 85వ స్థానంలో ఉన్న భారత్.. ఈ ఏడాది టాప్ 80స్థానంలో నిలిచింది. దీంతో భారత పాస్ పోర్టు ఉన్న వారు 55 దేశాలకు వీసా లేకుండా వీసా ఆన్ ఆరైవల్ తో ప్రయాణించే వీలుంది. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో భారత పాస్ పోర్టు ర్యాంకు మెరుగుపడుతుందని చెప్పాలి. దీంతో భారతీయులు పలు దేశాలకు వీసా అవసరం లేకుండా వెళ్లే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఆసక్తికరంగా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టాప్ 5 స్థానానికి చేరుకుంది. ఎలాంటి వీసా అవసరం లేకుండా 184 దేశాలకు యూఏఈ పాస్ పోర్టు ఉన్న వారు ప్రయాణించే వీలుంది. టాప్ 10లో ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా, అమెరికాలు నిలిచాయి. గతంలో అమెరికా టాప్ 10లో లేదన్న సంగతి తెలిసిందే. తాజాగా దాని స్థానం మెరుగు పడింది. ఈ నివేదిక మరో అంశాన్ని ప్రస్తావించింది.
ప్రపంచ ప్రయాణ స్వేచ్ఛలో అసమానతలు పెరుగుతున్నట్లుగా చెప్పింది. యూరప్ దేశాలు టాప్ ర్యాంకుల్లో అధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లుగా పేర్కొంది. భారత్ పాస్ పోర్టు ర్యాంకు మెరుగు పర్చటం ప్రధాని మోడీకి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. పదకొండేళ్లుగా భారత ప్రధానిగా వ్యవహరించటం.. స్థిరమైన ప్రభుత్వాన్ని..ఆర్థికంగా దేశం బలోపేతం కావటం లాంటి కారణాలు కూడా పాస్ పోర్టు బలోపేతానికి కారణంగా చెబుతున్నారు.
This post was last modified on January 16, 2026 7:41 am
చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ 'ఏక్ దిన్' ఎట్టకేలకు విడుదల కానుంది. మే 1…
మనమే తర్వాత గ్యాప్ తీసుకున్న శర్వానంద్ కు నారి నారి నడుమ మురారి రూపంలో పెద్ద రిలీఫ్ దొరికింది. ఇంత…
బాక్సాఫీస్ వద్ద మన శంకరవరప్రసాద్ గారి తుఫాను కొనసాగుతోంది. మూడు రోజులకే నూటా యాభై కోట్ల మార్కుని దాటేసిన మెగాస్టార్…
పార్టీలు ఏవైనా.. నాయకులు ఎవరైనా వివాద రహితులుగా ఉన్నారా? వారిపై ఎలాంటి మచ్చలు లేవా? అయితే.. ఇదే ప్రామాణికంగా.. జనసేన,…
టాలీవుడ్ గత కొన్నేళ్లలో చూడని పెద్ద స్థాయిలో సంక్రాంతిని సెలెబ్రేట్ చేసుకుంటోంది. రాజా సాబ్ వైఫల్యం కాసేపు పక్కనేపడితే మిగిలిన…
సినిమాల ప్రభావం సమాజం మీద ఉండదు అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా తెలుగువారి జీవితాల్లో సినిమా అనేది ఒక అంతర్భాగంగా మారిపోయిన…