ఇది కేరళ కాదు… ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆత్రేయపురంలో పండుగ వాతావరణం నెలకొంది అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. డ్రాగన్ పడవల పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆత్రేయపురం ఉత్సవ ప్రాంగణం ఉత్సాహంతో నిండిపోయింది. పండుగ సంబరాలు స్థానికులకే కాకుండా సందర్శకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
కేరళను తలపించే డ్రాగన్ పడవల పోటీలు ఆత్రేయపురం వేదికగా ఘనంగా నిర్వహించడంతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ఈ పడవ పోటీలు ఆత్రేయపురం పేరును రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలో చాటాయి. గోదావరి నదిపై ఉచ్చిలి నుంచి తాడిపూడి వంతెన వరకు 1000 మీటర్ల దూరంలో జరిగిన ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
మొత్తం 22 జట్లు పోటీపడగా కేరళ (అలెప్పీ), బండారు, కోనసీమ, పల్నాడు–1, కర్నూలు, ఎర్ర కాలువ జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. కేరళ తరహా పడవ పోటీలు స్థానికంగా నిర్వహించడంపై నిర్వాహకులతోపాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీలు ఆత్రేయపురం ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని వారు పేర్కొన్నారు. లొల్ల లాకుల వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్లు, ముగ్గుల పోటీలు ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి.
This post was last modified on January 15, 2026 11:16 am
నిన్న లోకేష్ కనగరాజ్ అనౌన్స్ మెంట్ వచ్చాక అల్లు అర్జున్ సినిమాల గురించి మరోసారి చర్చ మొదలయ్యింది. ఎందుకంటే అట్లీది…
2026 బాక్సాఫీస్ సంక్రాంతి ప్రధాన ఘట్టం అయిపోయింది. మొత్తం అయిదు సినిమాల స్క్రీనింగ్లు అయిపోయాయి. టెక్నికల్ గా నారి నారి…
ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న క్రైం కథనాలు చూస్తే షాక్ కు గురి కావాల్సిందే. ఇలా కూడా చేస్తారా? అన్న…
రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న మొన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక…
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నాయకులు నెరవేరుస్తారా? అంటే.. తమకు అవకాశం ఉన్న మేరకు.. తమకు ఇబ్బంది లేని హామీలను నెరవేరుస్తారు.…
భారత ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన జారీ చేసింది. `ఆదేశంలో మన వాళ్లు ఎవరూ ఉండొద్దు. ప్రత్యేక విమానాలు ఏర్పాటు…