Political News

అమెరికాలో కడుపు కాలిపోతోందట.. నిరసనలతో రోడ్లెక్కారే

ప్రపంచాన్ని కనుసైగతో కమాండ్ చేసే అగ్రరాజ్యం అమెరికాను దారుణంగా దెబ్బ తీసింది కంటికి కనిపించని కరోనా వైరస్. సంపన్నదేశంలా చెప్పుకునే ఆ దేశానికి దిమ్మ తిరిగే షాకివ్వటమే కాదు.. సరైన దెబ్బ తగిలితే అగ్రరాజ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న విషయం కోవిడ్ 19 ఎపిసోడ్ తో ప్రపంచానికి అర్థమైపోయింది. యావత్ దేశాన్ని లాక్ డౌన్ చేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరించిన తీరుకు అమెరికా భారీ మూల్యాన్ని చెల్లించిందని చెప్పక తప్పదు.

మిగిలిన దేశాలతో పోలిస్తే.. అమెరికా అర్థిక వ్యవస్థ మాత్రమే కాదు.. అక్కడి ప్రజల జీవనవిధానం భిన్నంగా ఉంటుంది. మరింత అర్థమయ్యేలా చెప్పాలంటే వ్యక్తిగత ఆర్థిక క్రమశిక్షణ విషయంలో అమెరికన్లు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. మనకు మాదిరి ఆస్తులు పోగు వేసుకోవటానికి పెద్దగా ఇష్టపడరు.

సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి అలవాటున్న వేళ.. ఊహించని రీతిలో కరోనా లాంటి వైరస్ విరుచుకుపడితే పరిస్థితి ఎలా మారుతుందో అమెరికన్లకు ఇప్పుడు భాగా అర్థమవుతోంది.

అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో మూడు కోట్ల మంది నిరుద్యోగ ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకోవటం చూస్తే.. కరోనాకారణంగా పోయిన ఉద్యోగాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది. కరోనాకారణంగా పలు కంపెనీలు శాశ్వితంగా మూతపడగా.. మరికొన్ని కంపెనీల్లో ఉద్యోగులపై పెద్ద ఎత్తున వేటు వేశాయి. దీంతో.. పలువురు అమెరికన్ల జీవితాలు రోడ్డున పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారం కరోనా కారణంగా కోట్లాది మంది ఉద్యోగాలు పోయాయి.

పదకొండు లక్షల మందికి కరోనా సోకగా.. 66వేల మంది కరోనా కారణంగా మరణించారు. ఇదిలా ఉంటే.. తాజాగా తమ ఇంటి అద్దెల్ని చెల్లించలేమంటూ న్యూయార్కు వాసులు పలువురు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేయటం గమనార్హం. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో.. విలాసవంతమైన మహానగరంగా పేర్కొనే న్యూయార్కు సిటీలో ఉండటం అంటే మాటలు కాదు. అలాంటి సంపన్నులు సైతం ఇప్పుడు హాహాకారాలు చేస్తున్నారు.

ఏ నెలకు ఆ నెల వచ్చే మొత్తాన్ని పూర్తిగా వాడేయటం.. భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా లెక్కలోకి తీసుకొని ఖర్చు చేసే అలవాటున్న అమెరికన్లకు.. కరోనాలాంటి ఉత్పాతాలు భారీగా దెబ్బ తీస్తాయి. ఈ విషయంలో భారతీయుల పరిస్థితి చాలా బెటర్ అని చెప్పక తప్పదు. మే ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే కార్మిక దినోత్సవం కరోనా దెబ్బకు అందరూ కామ్ గా ఉండిపోయారు.

ఇందుకు భిన్నంగా అమెరికన్లు మాత్రం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేపట్టారు. నో మనీ.. నో రెంట్ అంటూ వారు తమ అద్దెల్ని ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతున్నారు. నిరసనకారులు చేస్తున్న నిరసలనకు ప్రతిపక్ష డెమొక్రాట్లు సైతం మద్దతు పలుకుతున్నారు. ఉద్యోగుల హక్కుల్ని ప్రభుత్వం కాపాడాలని.. తమను ఆర్థికంగా ఆదుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండటం చూస్తే.. కరోనా ఎంత భారీగా దెబ్బ తీసిందో ఇట్టే అర్థం కాక మానదు.

This post was last modified on May 3, 2020 12:19 pm

Share

Recent Posts

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

1 hour ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

2 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

2 hours ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

3 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

5 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

6 hours ago