ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు, ఘర్షణలు లేకుండా తెలుగు వారు ప్రశాంతంగా జీవించాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమస్యలను కలిసి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
కోర్టుల్లో కాకుండా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను మనమే పరిష్కరించుకుందాం అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జల వివాదాలపై స్పందించారు. నీటిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని తాము భావించడం లేదన్నారు. పంచాయతీ కావాలా నీళ్లు కావాలా అని అడిగితే నీళ్లే కావాలని చెబుతానన్నారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డు పడకూడదని వ్యాఖ్యానించారు. ఏపీ అడ్డు పడుతున్నందుకే కేంద్రం నుంచి నిధులు రావడం లేదన్నారు.
ఆయా ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించలేమని రేవంత్ రెడ్డి చెప్పారు. ఏపీ ప్రభుత్వం చెబుతున్న సాకుల వల్లనే కేంద్రం నీటి ప్రాజెక్టులను అడ్డుకుంటోందన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సహకరించాలని కోరారు. తాము ఏపీతో ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఉన్న సమస్యలను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణకు పోర్టు సౌకర్యం లేదని, ఏపీలోని కాకినాడ మరియు విశాఖ పోర్టుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఈ విషయంలో ఏపీ సహకారం అవసరమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేస్తే తాము పది అడుగులు ముందుకు వస్తామని చెప్పారు.
This post was last modified on January 10, 2026 8:44 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…