రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు బయలుదేరారని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. కొందరు రాయలసీమ ఎత్తిపోతల పేరుతో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
నాకు గొడవలు కాదు.. తెలుగు జాతి ప్రయోజనాలే కావాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం పూర్తి అయితే తెలంగాణ రాష్ట్రం కూడా ఆ నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. వివాదాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అందరికీ చెబుతున్నానని తెలిపారు.
పట్టిసీమ నిర్మించి కృష్ణా డెల్టాలో నీటిని వినియోగించుకుందామంటే వ్యతిరేకించారని, కృష్ణా డెల్టాలో ఇచ్చే నీటిని పొదుపు చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకు తరలించామని చెప్పారు. ఈ ఏడాది రాయలసీమలోని రిజర్వాయర్లలో నీటిని నింపామని వెల్లడించారు.
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు, ప్రస్తుతం రాయలసీమ నీటి కొరతను తీర్చి ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. అయినా కొందరు నీళ్లు వద్దు.. వివాదాలే కావాలని నానా యాగీ చేస్తున్నారని విమర్శించారు.
రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు
తిరుమలలో మద్యం బాటిళ్ల వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై ప్రసాదాన్ని కల్తీ చేశారని, కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని వైసీపీ పాలనను దుయ్యబట్టారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ప్రసాదాన్ని ఎలాంటి కల్తీ లేకుండా పవిత్రంగా తయారు చేస్తున్నామని తెలిపారు. వ్యవస్థలు సక్రమంగా నడుస్తుంటే మళ్లీ కొన్ని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ కూడా ఇవ్వని వ్యక్తులు తిరుమల కొండపై మద్యం బాటిళ్లు వేసి అపవాదు సృష్టించే ప్రయత్నం చేశారని పరోక్షంగా భూమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బాటిళ్ల వ్యవహారంలో దొంగలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రాన్ని గంజాయితో సర్వనాశనం చేశారని, కోవిడ్ సమయంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్‌ను వేధించి చంపేశారని విమర్శించారు. అయితే, ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, కోటి రూపాయల పరిహారం అందించామని తెలిపారు.
వైసీపీ చేసిన పాపాలను కడిగేసే ప్రయత్నం చేస్తున్నామని, ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని చంద్రబాబు అన్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
This post was last modified on January 9, 2026 10:41 pm
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…