ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్ పేజీపై నిలిచారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల సృష్టికి కేంద్రబిందువుగా మారిన లోకేష్‌ను మ్యాగజైన్ ‘చీఫ్ జాబ్ క్రియేటర్’గా అభివర్ణించింది.
స్టాన్‌ఫోర్డ్, కార్నెగీ మెలన్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో శిక్షణ పొందిన నారా లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌ను కార్యరూపంలోకి తీసుకొచ్చే దిశగా వేగవంతమైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారని పేర్కొంది. పరిశ్రమలతో సమన్వయం, విధానపరమైన సంస్కరణలు, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఇన్వెస్టర్లకు ప్రథమ గమ్యంగా మార్చుతున్నారని మ్యాగజైన్ తెలిపింది.
ఇదే కాకుండా, గతంలో ప్రముఖ జాతీయ పత్రిక బిజినెస్ స్టాండర్డ్ కూడా నారా లోకేష్‌ను ‘జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్’గా అభివర్ణించింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏపీ–రిలయన్స్ ఒప్పందం కేవలం 30 రోజుల్లోనే రూ.65 వేల కోట్ల పెట్టుబడిని సాధించిన నేపథ్యంలో, లోకేష్‌తో ఆ పత్రిక ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్‌గా ఆయన పోషిస్తున్న పాత్రను ప్రశంసిస్తూ, పెట్టుబడులు మరియు ఉపాధి లక్ష్యంగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొంది.
మొత్తంగా, నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, ఆర్థిక పునరుజ్జీవనం మరియు ఉద్యోగాలే కేంద్రబిందువుగా మారుతున్నాయని జాతీయ మీడియా స్పష్టం చేస్తోంది.
This post was last modified on January 8, 2026 3:26 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…