Political News

పాపులేష‌న్ కంట్రోల్ లా.. ఎందుకు ట్రెండవుతోంది?

క‌రోనా దెబ్బ‌కు దేశంలో ఒక ర‌క‌మైన విభ‌జ‌న క‌నిపిస్తున్న మాట వాస్త‌వం. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా హిందువులు, ముస్లింల మ‌ధ్య విభ‌జ‌న చూస్తున్నాం ఇప్పుడు. మోడీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి విభ‌జ‌న రేఖ క్ర‌మంగా పెద్ద‌ది అవుతుండ‌గా.. క‌రోనా వ్యాప్తిని మ‌రో స్థాయికి తీసుకెళ్లిన మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల ఉదంతం అనంత‌రం పూడ్చ‌లేని అగాథం ఏర్ప‌డింది.

మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లొచ్చిన ముస్లింలు క‌రోనా ప‌రీక్ష‌ల‌కు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం.. వైద్య‌, పోలీసు సిబ్బందిపై దాడులు చేయ‌డం లాంటి ఉదంతాలు వారిపై మిగ‌తా వారిలో ద్వేషాన్ని పెంచాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్ని ఉప‌యోగించుకుని విశృంఖ‌లంగా ప్ర‌వ‌ర్తించే ముస్లింల‌పై అదుపు సాధించే ప్ర‌య‌త్నం మోడీ స‌ర్కారు చేస్తోంద‌న్న విశ్లేష‌ణ‌లు మీడియాలో వ‌స్తున్నాయి.

ఇలాంటి స‌మ‌యంలోనే ఉన్న‌ట్లుండి జ‌నాభా నియంత్ర‌ణ మీదికి కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి మ‌ళ్ల‌డం గ‌మ‌నార్హం. క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా కేంద్రం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై తాజాగా రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ఓ ప్ర‌సంగం చేశారు. అందులో భాగంగా మ‌న దేశంలో జ‌నాభా నియంత్ర‌ణ‌పై దృష్టిపెట్టాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి వ‌క్కాణించారు. ఇప్పుడు ఉన్న‌ట్లుండి జ‌నాభా నియంత్ర‌ణ గురించి రాష్ట్ర‌ప‌తి మాట్లాడ‌టంపై ఆస‌క్తి ఏర్ప‌డింది.

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని ఉటంకిస్తూ బీజేపీ అధికార ప్ర‌తినిధి అశ్విన్ ఉపాధ్యాయ్.. దేశంలో జ‌నాభా నియంత్ర‌ణ లేక‌పోవ‌డం వ‌ల్ల క‌రోనా వ్యాప్తి పెరుగుతుండ‌టం గురించి ప్ర‌స్తావించారు. ప్ర‌పంచంలోని పెద్ద దేశాల్లో అత్య‌ధిక జ‌న‌సాంద్ర‌త ఉన్న దేశం ఇండియానే అని.. మ‌న దేశం కంటే విస్తీర్ణంలో 3 రెట్లున్న అమెరికాలో 33 కోట్ల‌ జ‌నాభా మాత్ర‌మే ఉంద‌ని.. కానీ మ‌న జ‌నాభా 135 కోట్లు దాటిపోయింద‌ని.. ఈ జ‌నాభాకు త‌గ్గ‌ట్లుగా వ‌న‌రులు లేక భ‌విష్య‌త్తు ఆందోళ‌నక‌రంగా ఉండ‌బోతుందని ఆయ‌న‌ పేర్కొన్నారు.

ప్ర‌స్తుత జ‌నాభాకు త‌గ్గ‌ట్లు ఏడాదికి 25 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌న అవ‌స‌ర‌మ‌వుతోంద‌ని.. అది అసాధ్య‌మైన ప‌ని అని.. జ‌నాభా నియంత్ర‌ణ లేకుంటే భ‌విష్య‌త్ త‌రాల‌కు గ‌డ్డు ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ముస్లింలు అస‌లు జ‌నాభా నియంత్రణ పాటించ‌కుండా ఇబ్బ‌డిముబ్బ‌డిగా పిల్ల‌ల్ని కంటార‌న్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో వారికి కూడా వర్తించేలా పాపులేష‌న్ కంట్రోల్ లా తేవాల‌న్న డిమాండ్ పెరుగుతోంది. ఈ హ్యాష్ ట్యాగ్‌తో పెద్ద ఎత్తున ట్వీట్లు ప‌డుతున్నాయి. పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. ఈ దిశ‌గా మోడీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌న్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

2 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

4 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

4 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

5 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

6 hours ago