తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించుకునే కానుకల హుండీ పరకామణిలో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. 2021-22 మధ్య కాలంలో రవికుమార్ అనే ఉద్యోగి(కాంట్రాక్టు) 900 డాలర్లను దొంగిలించారు. ఈ విషయం బయటకు వచ్చాక రాజీ చేసుకున్నారు.
దీనిని ప్రశ్నిస్తూ.. తిరుపతికి చెందిన ఓ జర్నలిస్టు.. హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ జరుగుతోంది. గత విచారణలో పరకామణి లెక్కింపు వ్యవహారంపై తక్షణమే విధానాలు మార్చాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన విచారణలో తిరుమల తిరుపతి దేవస్థానం ఓ నివేదికను కోర్టుకు సమర్పించింది. పరకామణి లెక్కింపు విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నట్టు తెలిపింది. అయితే.. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక ప్రశ్నలు సంధించింది.
తాము చెప్పినట్టుగా మార్పులు చేసేందుకు మీరెందుకు వెనుకాడుతున్నారంటూ.. ప్రశ్నించింది. లెక్కింపు సమయంలో లుంగీలతో భక్తులను అనుమతించేబదులు ప్రత్యామ్నాయ విధానాలు చూడలేరా? అని ప్రశ్నించింది.
అదేవిధంగా నేలపై కూర్చునికాకుండా.. టేబుళ్లు ఏర్పాటు చేసే విధానం పరిశీలించాలని కోరామని.. కానీ దీనిపైనా స్పందించలేదని అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. అదేవిధంగా ఏఐని వినియోగించి లెక్కింపు చేపేట్టే ప్రక్రియపైనా టీటీడీ బోర్డు నిర్ణయం వెల్లడించకపోవడాన్ని కూడా తప్పుబట్టింది.
పరకామణి దొంగతనం కేసులో ప్రమేయం ఇంకెవరెవరికి ఉందని కోర్టు ఆరా తీసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టరాదని.. ప్రతి విషయాన్నీ కూలంకషంగా చర్చించి.. నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పరకామణి కేసు అంటే.. కేవలం ఒకరిద్దరికి సంబంధించిన వ్యవహారం కాదని.. కోట్ల మంది శ్రీవారి భక్తులకు సంబంధించిన కేసుగా హైకోర్టు స్పష్టం చేసింది.
This post was last modified on January 6, 2026 2:50 pm
మన శంకరవరప్రసాద్ గారు ప్రమోషన్లలో చివరి ఘట్టం పూర్తయ్యింది. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్…
మన శంకరవరప్రసాదుగారులోని చివరి పాట వచ్చేసింది. ముందు నుంచి దీని గురించి ఓ రేంజ్ లో చెబుతూ వచ్చిన టీమ్…
ప్రభాస్ హీరోగా మారుతి రూపొందించిన రాజాసాబ్ డిసెంబరు 5నే రిలీజ్ కావాల్సింది. కానీ సంక్రాంతి సీజన్ అయితే బాగుంటుందని ఈ…
చాలా గ్యాప్ తర్వాత సమంతా ఫుల్ లెన్త్ మూవీతో రాబోతోంది. తనే నిర్మించిన శుభంలో చిన్న క్యామియో చేసినప్పటికీ అది…
ఏపీ కేడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత ఇటీవల తరచుగా…
తెలుగులో ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా.. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి ముందుండే హీరో విక్టరీ వెంకటేష్. ప్రతి సినిమాలో హీరోయిజమే ఉండాలని..…