ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం ఇప్పట్లో సాధ్యమేనా? ఏ రాష్ట్ర వాదన ఎలా ఉంది? అనే అంశాలను పరిశీలిస్తే, ఈ సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే (మీడియేషన్) మార్గంగా కనిపిస్తోంది. ఈ మాట ఎవరో కాదు, సాక్షాత్తూ సుప్రీంకోర్టే తాజాగా వ్యాఖ్యానించింది.
ఏపీ ప్రతిపాదిత పోలవరం నల్లమల సాగర్ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ప్రాజెక్టును తొలుత బనకచర్ల పోలవరం గా నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
కానీ ఈ వ్యవహారం కేంద్రం పరిధిలోకి వెళ్లడంతో, అక్కడ జరిగిన కొద్దిపాటి ఒప్పందం మేరకు ప్రాజెక్టును నల్లమల పోలవరం సాగర్ గా మార్చి, అక్కడి వరకు ఎత్తిపోతలు చేయాలని నిర్ణయించారు. అయితే దీనిపైనా తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఈ క్రమంలోనే డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారీకి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిన వెంటనే తెలంగాణ సుప్రీంకోర్టులో కేసు వేసింది. వాస్తవానికి రెండు రోజుల కింద తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, బనకచర్ల ప్రాజెక్టు తన వల్లే ఆగిపోయిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో జరిపిన చర్చల కారణంగానే ఇది నిలిచిందని చెప్పారు.
కానీ అది ఆగలేదని, కొత్త రూపంలో నిర్మాణం చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గోదావరి నదిలో రెండు రాష్ట్రాల వాటా పోను, మిగిలిపోయిన జలాలను నల్లమల సాగర్ వరకు ఎత్తిపోసి, సీమకు సాగు మరియు తాగునీరు అందించాలన్నదే లక్ష్యమని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
అయితే అసలు మిగులు జలాల మాటే వద్దని, కేవలం కేటాయింపుల వరకు మాత్రమే పరిమితం కావాలని తెలంగాణ వాదిస్తోంది. నల్లమల పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపులు లేనందున తమ నీటిని వాడుకునే అవకాశం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.
తాజాగా సోమవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కూడా తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. అయితే ఇలాంటి సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించింది.
దీనికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు. సదరు ప్రాజెక్టును నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాలని కోర్టును కోరింది. అయితే ఏపీ మాత్రం ఈ విషయంలో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండబోదని, అలాంటప్పుడు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించింది.
వెయ్యి టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుంటే, తాము కేవలం 100 నుంచి 200 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకుంటామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా సుప్రీంకోర్టు ఈ కేసును ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసినా, మధ్యవర్తిత్వంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని చెప్పడం గమనార్హం.
This post was last modified on January 5, 2026 10:27 pm
ఇవాళని మినహాయిస్తే జన నాయకుడు విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఇంకా సెన్సార్ సమస్యలు తొలగిపోలేదు. అధికారులు…
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన విషయం బయటపడింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) విడుదల చేసిన కొత్త…
మూవీ లవర్స్ పాతికేళ్ల క్రితమే కోరుకున్న కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం. కానీ రెండుసార్లు…
ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్లో ఎన్నడూ లేనంత పోటీని చూడబోతున్నాం. తెలుగు నుంచి ఏకంగా అయిదు సినిమాలు రిలీజవుతున్నాయి. వీటికి…
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించుకునే కానుకల హుండీ పరకామణిలో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. 2021-22 మధ్య కాలంలో రవికుమార్…
వైసీపీ అధినేత జగన్పై విమర్శల జోరు పెంచాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఎలా ఉన్నా, గత…