వెనిజులాలో అమెరికా చేసిన దాడి ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అక్కడ ప్రభుత్వం మారితే మనకేంటి అని లైట్ తీసుకోకండి. ఈ పరిణామం ఇండియాకు ఒక రకంగా ‘శుభవార్త’ మోసుకొచ్చేలా ఉంది. అక్కడ జరిగే మార్పులు మన స్టాక్ మార్కెట్ కు న్యూట్రల్ గా అనిపించినా, మన ప్రభుత్వ ఆయిల్ కంపెనీలకు మాత్రం కాసుల వర్షం కురిపించే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
అసలు మ్యాటర్ ఏంటంటే.. మన ONGC విదేశ్ లిమిటెడ్ కు వెనిజులా నుంచి రావాల్సిన బకాయిలు చాలానే ఉన్నాయి. అక్కడ అమెరికా ఎంట్రీతో, పెట్రోలియస్ డి వెనిజులా రీస్ట్రక్చరింగ్ జరిగితే.. దాదాపు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8000 కోట్లు) పెండింగ్ అమౌంట్ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. 2014 నుంచి డివిడెండ్స్ రూపంలో రావాల్సిన దాదాపు 536 మిలియన్ డాలర్లు అక్కడ ఇరుక్కుపోయాయి. ఇప్పుడు ఆంక్షలు తొలగిపోతే ఆ డబ్బు ఇండియాకు రావడం ఖాయం.
ఇక సామాన్యుడి జేబు విషయానికి వస్తే.. వెనిజులా నుంచి ఆయిల్ సప్లై పెరిగితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ లో ఆయిల్ ధరలు తగ్గడం మన ఎకానమీకి బూస్ట్ ఇస్తుంది. తక్కువ ఆయిల్ ధరలు ఉంటే అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గి, డాలర్ వీక్ అవుతుంది. ఇది మనలాంటి ఎమర్జింగ్ మార్కెట్లకు కలిసొచ్చే అంశం.
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మనం రష్యా ఆయిల్ మీద ఎక్కువగా ఆధారపడ్డాం. ఇప్పుడు వెనిజులా నుంచి ‘హెవీ క్రూడ్ ఆయిల్’ అందుబాటులోకి వస్తే.. మన రిఫైనరీలకు పండగే. ఇది మన ఆయిల్ ఇంపోర్ట్ స్ట్రాటజీని మార్చేసి, రష్యా మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. రిలయన్స్ వంటి కంపెనీలకు కూడా ముడి చమురు సోర్సింగ్ లో ఆప్షన్లు పెరుగుతాయి.
షార్ట్ టర్మ్ లో కొంచెం గందరగోళం ఉన్నా, వెనిజులా ఎపిసోడ్ ఇండియాకు పాజిటివ్ గానే కనిపిస్తోంది. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం సేఫ్ అని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్ లో ONGC, ఆయిల్ ఇండియా వంటి షేర్ల మీద కన్నేసి ఉంచడం మంచిది. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నా, సెలెక్టివ్ గా ఇన్వెస్ట్ చేసేవారికి ఇది మంచి టైమ్.
This post was last modified on January 5, 2026 9:49 pm
ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి తన మనసు చాటుకున్నారు. లోకల్‌గానే కాదు... విదేశాల్లో కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని…
ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఏడాదిలో తొలిసారి బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను సీఎంవో అధికారులు వివరించారు.…
ఏపీలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో సీఎం…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. అసెంబ్లీని బాయ్…
దర్శకుడు ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన అయోమయం ఇంకా తొలగడం లేదు. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్…
ఇవాళని మినహాయిస్తే జన నాయకుడు విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఇంకా సెన్సార్ సమస్యలు తొలగిపోలేదు. అధికారులు…