ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విషమ పరీక్షగా మారారా? ట్రంప్ దూకుడు కారణంగా విశ్వగురు మోడీకి ఇబ్బందులు తప్పేలా లేవా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. గత ఏడాది జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు శాంతి ప్రవచనాలు చెబుతూనే మరోవైపు ప్రపంచ దేశాలను ఇరకాటంలోకి నెడుతున్నారు.
ఈ క్రమంలోనే గత ఏడాది పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాల కూల్చివేత లక్ష్యంగా జరిగిన ఆపరేషన్ సిందూర్‌ను తానే ఆపేశానని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇలా ఒక్కసారి రెండు సార్లు కాదు ఇప్పటివరకు పది పదిహేను సార్లు ఇదే వ్యాఖ్య చేశారు. ఇది ప్రధాని మోడీకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది.
అంతేకాదు భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ టారిఫ్‌లు పెంచేశారు. కొన్ని వస్తువులపై 70 శాతం మరికొన్నింటిపై 50 శాతం వరకు సుంకాలు విధించారు.
ఇలా వరుసగా భారత్‌ను ఇరుకున పడేసినా మోడీ ఇప్పటివరకు ట్రంప్‌పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విద్యార్థి వీసాల నుంచి హెచ్ వన్ బీ వీసాల వరకు భారత్‌కు కోతలు విధించినా మోడీ స్పందించలేదు. అయితే దేశీయంగా చూస్తే ట్రంప్ దూకుడుపై మోడీకి ఎప్పటికప్పుడు సెగ తగులుతూనే ఉంది.
తాజాగా మరోసారి ట్రంప్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మోడీ మంచి వాడేనని చెప్పిన ట్రంప్ ఆయన వైఖరితో తాను సంతృప్తిగా లేనని కుండబద్దలు కొట్టారు.
ఈ నేపథ్యంలో భారత్‌పై మరింతగా సుంకాల మోత మోగిస్తానంటూ ట్రంప్ చేసిన తాజా ప్రకటన మోడీకి మరిన్ని ఇబ్బందులు తెచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే పెంచిన టారిఫ్‌ల కారణంగా దేశీయంగా ఆక్వా మరియు వజ్రాల పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు మరిన్ని వస్తువులపై సుంకాలు పెంచితే భారతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ట్రంప్ వ్యాఖ్యలతో ఇప్పటికే స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
This post was last modified on January 5, 2026 2:27 pm
కలెక్టర్లపై ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డి కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.…
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఈ నెల 9వ…
సినీ రంగంలో హీరో హీరోయిన్ల మధ్య డేటింగ్ రూమర్లు రావడం చాలా సహజం. బాలీవుడ్లో అయితే ఇలాంటి వార్తల్లో చిక్కుకోని…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీర రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ వరల్డ్ మూవీ వారణాసి విడుదల గురించి రకరకాల…
రెండు కీలకమైన ఎస్సీ నియోజకవర్గాల్లో టిడిపికి తీవ్ర ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పదేపదే ఆయా నియోజకవర్గాల నుంచి వివాదాలు విమర్శలు…
వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అయితే త్వరలోనే ఇద్దరూ ప్రజల…