దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను దాటి పారిశ్రామిక వృద్ధిలో ఏపీ ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందించారు.
పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, వేగవంతమైన నిర్ణయాలు, పరిశ్రమల ఏర్పాటుకు సులభమైన వాతావరణమే ఈ విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా దూసుకెళ్తోందని, రానున్న రోజుల్లో మరింత పెద్ద స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫోర్బ్స్ ఇండియా కథనాన్ని లోకేష్ ట్యాగ్ చేశారు. దీని ప్రకారం, దేశంలో పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ప్రకటించిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాను ఏపీ దక్కించుకుంది. దీంతో దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది..ఈ జాబితాలో ఒడిశా 13.1 శాతం వాటాతో రెండో స్థానంలో ఉండగా, మహారాష్ట్ర 12.8 శాతం వాటాతో మూడో స్థానంలో నిలిచింది.
ఈ మూడు రాష్ట్రాలకు కలిపి మొత్తం పెట్టుబడుల్లో 51.2 శాతం కేంద్రీకృతమవడం గమనార్హం. ఇది దేశంలోని పారిశ్రామిక పెట్టుబడులు తూర్పు, దక్షిణ రాష్ట్రాల వైపు మళ్లుతున్నాయన్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
అదేవిధంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా పెట్టుబడి ప్రకటనలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11.5 శాతం పెరిగి రూ. 26.6 లక్షల కోట్లకు చేరినట్లు ఫోర్బ్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల విశ్వాసం మరింత బలపడుతున్నదనానికి నిదర్శనంగా పేర్కొంది.
This post was last modified on January 2, 2026 11:04 pm
కొందరు పరభాషా కథానాయికలను చూస్తే.. వాళ్లు వేరే భాషకు చెందిన వాళ్లు అనే ఫీలింగే రాదు. చక్కగా తెలుగు నేర్చుకుని,…
ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దంన్నర దాటినా ఇంకా స్ట్రగులవుతూనే ఉన్న హీరోల్లో నందు ఒకడు. మధ్యలో సపోర్టింగ్ రోల్స్ చేశాడు కానీ…
జన నాయకుడు విడుదల రాజా సాబ్ తో పాటే ఉన్న నేపథ్యంలో ఏపీ తెలంగాణలో విజయ్ సినిమాకు వచ్చే ఓపెనింగ్స్…
రాజమౌళి ప్రతిభ కేవలం సినిమా తీయడం వరకే పరిమితం కాదు. ఆయన బాగా నటించగలరు. అలాగే డ్యాన్సులు కూడా ఇరగదీస్తారు.…
అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ గ్రామానికి ఒక శాపమో, దెయ్యమో ఆవహించి ఉంటుంది. దాన్ని వదిలించాలంటే హీరో రంగంలోకి…
జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఆటలో ఒక ప్లేయర్ హెల్మెట్…