కొంతమంది మహిళా నేతలు ఈ ఏడాది జోరుగా రెచ్చిపోయారు. నియోజకవర్గంతో పాటు స్థానిక రాజకీయాల్లో తమ హవా చూపించాలన్న ఉద్దేశంతో పలువురు మహిళా నేతలు దూకుడు చూపించారు. అయితే తొలి రోజుల్లో కనిపించిన ఆ దూకుడు, తర్వాత కాలంలో తగ్గడం చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉండటం గమనార్హం. ముఖ్యంగా నియోజకవర్గ రాజకీయాల్లో దూకుడు చూపించిన వారు, పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో వెనక్కి తగ్గక తప్పలేదు.
ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి 2024లో విజయం సాధించిన భూమా అఖిల ప్రియ, అప్పటి నుంచి ఈ ఏడాది తొలి ఏడెనిమిది నెలల పాటు దూకుడుగానే వ్యవహరించారు. అయితే ఈ దూకుడులో వైసీపీ నేతలకన్నా సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడంతో పాటు వివాదాలకు కేంద్రంగా మారారు.
ముఖ్యంగా పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి, సొంత వ్యవహారాలపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో వివాదాలు కొని తెచ్చుకున్నారన్న విమర్శలు వచ్చాయి. దీంతో పార్టీ హెచ్చరికలు రావడం, ఆ తర్వాత ఆమె వెనక్కి తగ్గడం జరిగింది.
కడప నుంచి తొలిసారి విజయం సాధించిన రెడ్డప్పగారి మాధవీ రెడ్డి కూడా గత ఏడాది నుంచి ఈ ఏడాది తొలి ఆరు నెలల వరకు దూకుడుగా వ్యవహరించారు. ఇది సొంత పార్టీ నాయకులతో ఆమెకు మధ్య వివాదాలకు దారి తీసింది.
కడప కార్పొరేషన్‌ను దక్కించుకునే క్రమంలో ఆమె విఫలమవడంతో, అప్పటి వరకు కనిపించిన మాధవీ హవా దాదాపు తగ్గిపోయింది. మరోవైపు జిల్లా ఇంచార్జ్ బాధ్యతలను కూడా తగ్గించడంతో కడపలో మాధవీ వర్గానికి షాక్ తగిలినట్టయింది.
మంత్రి సుధారాణి కూడా ఈ ఏడాది చివర్లో ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆమె కుమారుడిపై వచ్చిన ఆరోపణలు అప్పట్లో చర్చకు దారితీశాయి. దీని ప్రభావంతో ఆమె రాజకీయ వ్యవహారాలు కూడా ఇరుకుల్లో పడినట్టు అయ్యాయి.
ఇక గుంటూరుకు చెందిన మరో మహిళా ఎమ్మెల్యే కూడా వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఆమె కొంత వెనక్కి తగ్గారు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే కూడా సొంత కూటమి నాయకులతో వివాదాల్లో చిక్కుకుని ఈ ఏడాది కొంతకాలం చర్చల్లో నిలిచిన విషయం తెలిసిందే.
This post was last modified on January 2, 2026 11:17 pm
చిన్నపిల్లాడిగా ఉండగా రుద్రమదేవి.. టీనేజీలో నిర్మలా కాన్వెంట్ సినిమాలు చేసిన శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా.. ఆ తర్వాత పెళ్ళిసందడి…
జన నాయకుడు ట్రైలర్ వచ్చాక అందరి డౌట్లు తీరిపోయాయి. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం…
తెలంగాణ శాసన సభ శీతాకాల సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ఇరిగేషన్ ప్రాజెక్టుల…
తెలుగులో కామెడీ బాగా డీల్ చేయగల దర్శకుల్లో మారుతి ఒకడు. అతను తీసిన చిత్రాల్లో చాలా వరకు ఎంటర్టైనర్లే. ‘భలే…
తెలంగాణలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దీనిలో అధికార కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. ఇక, దీనికి ముందు.. జూబ్లీహిల్స్…
కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం.. బీజేపీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు…