Movie News

హరీష్‌ను పవన్ కొట్టింది అందుకా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే దర్శకుడు హరీష్ శంకర్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన ఆరాధ్య కథానాయకుడిని తనలాంటి అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించి ‘గబ్బర్ సింగ్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు హరీష్. మళ్లీ ఈ ఇద్దరి కలయికలో ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్’ సింగ్ రాబోతోంది.

ఈ నెల 26న ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూ ద్వారా ప్రమోషన్లు మొదలుపెట్టేశాడు హరీష్. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి, మేకింగ్ గురించి అనేక విశేషాలు పంచుకున్న హరీష్.. ఇటీవల రిలీజ్ చేసిన ఒక ప్రోమోలో తనను పవన్ కళ్యాణ్ నవ్వుతూ కొడుతున్న మూమెంట్ వెనుక ఏం జరిగిందో వెల్లడించాడు.

సినిమాలో ఒక సన్నివేశంలో భాగంగా పెద్దవాడైన ఒక వ్యక్తి హీరోకు దండం పెట్టి తన బాధ చెప్పుకుంటే.. దండం పెట్టిన ఆ చేతులను పట్టుకుని కిందికి దింపి, అలా దండం పెట్టకండి.. మీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పాల్సి ఉంటుందట. ఈ సన్నివేశాన్ని ముందే పవన్‌కు వివరించి చెప్పాడట హరీష్. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా సీన్, డైలాగులను పవన్‌కు చెప్పాడట. ఐతే యాక్షన్ చెప్పాక.. అవతలి వ్యక్తి దండం పెట్టగానే నమస్కారానికి ప్రతి నమస్కారం అన్నట్లుగా.. సీన్ ప్రకారం ఏ చేయాలో మరిచిపోయిన పవన్ దండం పెట్టేశాడని హరీష్ వెల్లడించాడు.

రాజకీయాల్లో ఇలా దండం పెట్టిన వాళ్ళందరికీ దండం పెట్టడం అలవాటై పవన్ అలా చేశాడని.. దీంతో తాను కట్ చెప్పి నవ్వుకుంటూ పవన్ దగ్గరికి వస్తే.. అసలు విషయం గుర్తించిన ఆయన రోజు అలా అలవాటయిపోయిందని తెలిపారట.

ఈ విషయం గుర్తొచ్చి రెండో పాట రిలీజ్ కు ముందు పవన్ ను టీమ్ సభ్యులు కలిసినప్పుడు హరీష్ నమస్కరించే సన్నివేశం గుర్తు చేస్తూ పవన్ ను ఆటపట్టించడంతో నవ్వుతూ హరీష్ ను కొట్టినట్టు అసలు విషయం వెల్లడించాడు హరీష్ శంకర్.

పవన్ పొలిటికల్ కమిట్మెంట్ల వల్ల బాగా ఆలస్యమైన చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. 2024 ఎన్నికల తర్వాత వీలు చేసుకుని ముందుగా హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలను పూర్తి చేసిన పవన్.. చివరగా ‘ఉస్తాద్..’కు డేట్లు ఇచ్చి ఆ సినిమా పని కూడా అవగొట్టాడు. ముందు వేసవి మధ్యలో రిలీజ్ అనుకున్నారు కానీ.. ‘పెద్ది’ వాయిదా పడడంతో ఆ డేట్‌ను ‘ఉస్తాద్’ కోసం తీసుకున్నారు.

This post was last modified on March 2, 2026 1:54 pm

Share

Recent Posts

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

28 minutes ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

42 minutes ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

1 hour ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

2 hours ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

2 hours ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

3 hours ago