ఏపీకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రానున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో భారీ నిరసనకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి రానున్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి గ్రామంలో ఈ నిరసన సభ నిర్వహించనున్నారు.
బండ్లపల్లిని వేదికగా ఎంచుకోవడం వెనుక ప్రత్యేక రాజకీయ ప్రాధాన్యత ఉంది. 2006 ఫిబ్రవరి 2న ఇదే గ్రామంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ చేతుల మీదుగా ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఈ పథకం కోట్లాది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించిందని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది.
పథకం పేరును ‘వికసిత్ భారత్ రోజ్‌గార్ – అజీవికా హామీ మిషన్’గా మార్చడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది కేవలం పేరు మార్పు కాదని, మహాత్మాగాంధీ ఆలోచనలను తొలగించే ప్రయత్నమని పార్టీ ఆరోపిస్తోంది. పథకం ప్రారంభించి 20 ఏళ్లు పూర్తవుతున్న రోజునే అదే గ్రామంలో నిరసన చేపట్టడం ద్వారా కేంద్రానికి గట్టి సందేశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ సభ ద్వారా భవిష్యత్తు పోరాట కార్యాచరణను ప్రకటించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
This post was last modified on January 2, 2026 4:22 pm
రాజమౌళి ప్రతిభ కేవలం సినిమా తీయడం వరకే పరిమితం కాదు. ఆయన బాగా నటించగలరు. అలాగే డ్యాన్సులు కూడా ఇరగదీస్తారు.…
అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ గ్రామానికి ఒక శాపమో, దెయ్యమో ఆవహించి ఉంటుంది. దాన్ని వదిలించాలంటే హీరో రంగంలోకి…
జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఆటలో ఒక ప్లేయర్ హెల్మెట్…
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూసీ నదీ ప్రక్షాళనపై సభలో చర్చ జరిగింది. ఈ…
దర్శకుడు పూరి జగన్నాథ్ కంబ్యాక్ మూవీగా షూటింగ్ మొదలైనప్పటి నుంచే పాజిటివ్ వైబ్స్ మోస్తున్న స్లమ్ డాగ్ ( ప్రచారంలో…
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. అభిమానులు ప్రేమగా హీమ్యాన్ అని పిలుచుకునే ధర్మేంద్ర చివరి…