తిరుమల కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా కోట్లాది మంది భక్తులు ఇక్కడ స్వామివారి దర్శనానికి వస్తుంటారు. సామాన్య భక్తులతో పాటు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు సైతం మొక్కులు చెల్లించుకుంటారు. రోజుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఈ పవిత్ర క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడటం టీటీడీ ప్రధాన బాధ్యతగా భావిస్తోంది.
ఈ నేపథ్యంలో తిరుమలలో రాజకీయాలు, ద్వేషపూరిత వ్యాఖ్యలకు ఎలాంటి స్థానం లేదని టీటీడీ ట్రస్ట్ బోర్డు ఇప్పటికే స్పష్టంగా ప్రకటించింది. ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది. తిరుమల కొండపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నదే టీటీడీ స్పష్టమైన ఆదేశం ఉంది.
అయితే, ఇటువంటి ఆంక్షలు ఉన్నప్పటికీ శ్రీవారి సన్నిధిలో మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిరుమలలో దర్శనం అనంతరం ఆమె మాట్లాడుతూ ‘జగనన్న మళ్లీ సీఎం కావాలి’ అని కోరుకున్నట్లు తెలిపారు. పవిత్ర క్షేత్రంలో రాజకీయ ఆకాంక్షలు వ్యక్తపరచడం సరైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వాస్తవానికి తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం రోజాకు ఇదే మొదటిసారి కాదు. గతంలో వైసీపీ అధికారాన్ని కోల్పోయిన కొత్తలోనే, తిరుమల కొండపై నుంచే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆమె వ్యాఖ్యానించారు. అప్పట్లోనే ఆమె వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఘోర పరాజయం తర్వాత కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదని, పవిత్ర స్థలాల గౌరవాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారనే విమర్శలు మరోసారి వినిపిస్తున్నాయి.
This post was last modified on December 30, 2025 4:27 pm
ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను మరో రెండు జిల్లాలు కలుపుతూ.. 28 జిల్లాలుగా ఏర్పాటు…
‘రాజాసాబ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు మారుతి ఎంత ఎమోషనల్ అయ్యాడో తెలిసిందే. ‘రాజాసాబ్’ ముందు వరకు మారుతి తీసినవన్నీ…
ఒక ఎదురు దెబ్బ మనిషిని మారుస్తుంది. ఒక ఓటమి పార్టీలకు కనివిప్పు కలిగిస్తుంది. మరి అలాంటి ఇలాంటి ఓటమి కాకుండా..…
భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత ఏకంగా రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో…
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలు శుభాకాంక్షలు పంపించుకుంటున్న సమయంలోనే సైబర్ నేరగాళ్లు ఈ అవకాశాన్ని తమ మోసాలకు వాడుకుంటున్నారు.…
2009లో వచ్చిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ త్రీ ఇడియట్స్ కొనసాగింపుగా ఫోర్ ఇడియట్స్ తీసే ప్లాన్ లో దర్శకుడు రాజ్…