తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచి ఒక లెక్క…ఇకపై ఒక లెక్క అని కేసీఆర్ చెప్పడంతో నేటి నుంచి జరగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని ప్రచారం జరిగింది.
ఆ ప్రచారానికి తగ్గట్లుగానే దాదాపు రెండేళ్ల తర్వాత కేసీఆర్ శాసన సభలో అడుగుపెట్టారు. అయితే, సమావేశాలు మొదలైన 10 నిమిషాలకే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు.
ఈ రోజు అసెంబ్లీలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న రీతిలో మాటల యుద్ధం ఉంటుందని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా కేసీఆర్ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టి సభ మొదలైన10 నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అంతకుముందు, కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్ ఇచ్చి మర్యాదపూర్వకంగా పలకరించారని తెలుస్తోంది. కేసీఆర్ ఆరోగ్య, యోగక్షేమాలను రేవంత్ అడిగి తెలుసుకున్నారట.
అంతకుముందు సభలో దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మా రెడ్డిలకు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. సభ్యులంతా వారికి సంతాపం తెలిపారు. సంతాప తీర్మానాలు అయిపోయిన వెంటనే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు.
అయితే, రేపు లేదా ఈ శీతాకాల సమావేశాలు ముగిసేలోపు మరోసారి సభకు కేసీఆర్ వస్తారా? లేక డైరెక్ట్ గా వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా అన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. అయితే, అటెండెన్స్ కోసం మాత్రమే అసెంబ్లీకి వచ్చే ట్రెండ్ ను ఏపీ మాజీ సీఎం జగన్ స్టార్ట్ చేశారని, అదే రీతిలో జగన్ ను కేసీఆర్ ఫాలో అయ్యారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on December 29, 2025 11:32 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…