సోషల్ మీడియా కాలంలో రోడ్డు మీద ఏదైనా దౌర్జన్యం చేసి తప్పించుకోవాలని చూస్తే కష్టమే. ముఖ్యంగా అధికారంలో ఉన్నామన్న పొగరును కింది వాళ్లపై చూపిస్తే.. అది పొరబాటున ఎవరి ఫోన్లో అయినా రికార్డయితే అంతే సంగతులు. ఇలాంటి ఉదంతాలతో పొలిటికల్ కెరీర్లే ముగిసిపోయిన సందర్భాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ దేవళ్ల రేవతి పరిస్థితి ఇలాగే ఉందిప్పుడు.
ఆమె రెండు రోజుల కిందట గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్ దగ్గర హంగామా చేశారు. టోల్ ఫీజు చెల్లించాలని అడిగిన సిబ్బందిపై తన జులుం చూపించారు. కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను పక్కకు తీసి పడేసి, తనను అడ్డగించిన సిబ్బందిపై చేయి కూడా చేసుకున్నారు. నన్నే టోల్ కట్టమంటావా అంటూ ఆమె పరుష పదజాలంతో దూషించడం కూడా వీడియోలో రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాకు ఎక్కడం, వైరల్ కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. వ్యవహారం జాతీయ మీడియా దృష్టికి కూడా వెళ్లింది.
ఈ ఉదంతం రేవతికి మాత్రమే కాదు.. ప్రభుత్వానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో రేవతి మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గుంటూరులో ఉన్న తన తల్లి బాత్రూంలో పడిపోయి కాలు బెణికిందని, ఆమెను చూసేందుకు హడావుడిగా వెళ్తున్న సమయంలో తనను టోల్ గేట్ సిబ్బంది అడ్డగించడంతో తనకు కోపం వచ్చిందని ఆమె అంది.
తన దగ్గర ఫ్రీ పాస్ ఉందన్నా వాళ్లు ఒప్పుకోలేదని, ఎమర్జెన్సీలో వెళ్తున్న వాహనాలకు దారి ఇవ్వాలన్న జ్ఞానం లేకుండా దురుసుగా ప్రవర్తించడంతోనే తాను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని రేవతి వివరించారు. ఒక మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన టోల్ ప్లాజా సిబ్బందిని ఏమీ అనకుండా తన గురించి దుష్ప్రచారం చేయడమేంటని.. టోల్ ప్లాజా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తాను డీజీపీకి ఫిర్యాదు చేస్తానని ఆమె అన్నారు. ఐతే రేవతి ఇచ్చిన వివరణ పట్ల సోషల్ మీడియా జనం ఎంతమాత్రం సంతృప్తి చెందలేదని, ఆమె వివరణ వాస్తవికంగా లేదని.. సదరు పోస్టు కింద కామెంట్లు చూస్తే స్పష్టమవుతోంది.
This post was last modified on December 11, 2020 2:04 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…