ఏపీ రాజధాని అమరావతికి 2025 ఓ మహత్తర సంవత్సరమేనని చెప్పాలి. 2014-19 మధ్య ఏపీ రాజధానిగా ఏర్పడిన అమరావతి.. తర్వాత వైసీపీ హయాంలో వెనుకబడింది. అసలు దీనిని లేకుండా చేయాలని.. మూడు రాజధానులను తీసుకురావాలని వైసీపీ ప్రయత్నించింది. కానీ, రాజధాని రైతులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా గళం వినిపించారు. ఇక, ఈ ఏడాది రాజధాని పనులను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు స్వయంగా చొరవ తీసుకోవడంతో ఈ పనులు తిరిగి గాడిలో పెట్టారు.
42 వేల కోట్ల పనులు..
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి అటు ఆర్బీఐ నుంచి ఇటు ప్రైవేటు సంస్థల నుంచి అదేవిధంగా ప్రపంచ బ్యాంకు నుంచి కూడా నిధులు అందాయి. మొత్తం 15 వేల కోట్ల రూపాయల మేరకు ఒక్కొక్క సంస్థ నుంచి రుణాల రూపంలో సేకరించారు. అదేవిధంగా పనుల ప్రారంభాన్ని కూడా చేపట్టారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి.. రాజధాని నిర్మాణ పనులకు మరోసారి శంకు స్థాపన చేశారు. ఇక, రాజధానిలో నిర్మాణాలకు సంబంధించి 42 వేల కోట్ల పనులకు సీఆర్ డీఏ అనుమతులు మంజూరు చేసింది. దీంతో రేయింబవళ్లు పనులు ముందుకు సాగుతున్నాయి.
పెట్టుబడులు..
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఎలా అయితే.. పెట్టుబడులు ఆకర్షిస్తున్నారో.. అమరావతి రాజధాని విషయంలోనూ రాష్ట్రం పెట్టుబడులకు పెద్దపీట వేస్తోంది. దీనిలో భాగంగానే రాజధానిలో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, ప్రస్తుతం ఉన్న 33 వేల ఎకరాల భూములకు అదనంగా మరో 44 వేల ఎకరాలను సమీకరించే ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదే శ్రీకారం చుట్టింది. తొలినాళ్లలో ఇది వివాదం అయినా.. స్వయంగా చంద్రబాబు రైతులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇది కూడా అమరావతి ఉన్నతిని ముందుకు తీసుకువెళ్లింది.
పలు సంస్థలు..
అమరావతిలో కేవలం ప్రభుత్వ సంస్థలే కాకుండా.. ఇతర సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. వీటిలో ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం అచ్చంగా తిరుమలను పోలి ఉండే టెంపుల్ నిర్మాణాన్ని ప్రారంభించింది. వాస్తవానికి .. వైసీపీ హయాంలో నిలిచిపోయిన పనులు తిరిగి పుంజుకున్నాయి. దీనికి తోడు మరింత విస్తరించారు. అదేవిధంగా విద్యాసంస్థలతోపాటు.. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య చైర్మన్‌గా ఉన్న నందమూరి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కూడా భూమిపూజ జరిగింది.. నిర్మాణాలు చేపట్టింది కూడా ఈ సంవత్సరమే కావడం విశేషం.
అదేవిధంగా స్పోర్ట్స్ సిటీలో ప్రముఖ బ్యాడ్ మింటన్ క్రీడాకారుడు… పుల్లెల గోపీచంద్ కూడా.. క్రీడా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. మొత్తంగా 2025 సంవత్సరం అమరావతికి మహర్దశ పట్టేలా చేసిందనడంలో సందేహం లేదు.
This post was last modified on December 27, 2025 1:18 pm
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…