తెలంగాణలో కొత్త చట్టం తీసుకురానున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతాలపై ఎవరి నిర్బంధం ఉండదన్నారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా పేర్కొన్నారు. మత విద్వేషాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. కర్ణాటకలో కూడా ఇటీవల కొత్తచట్టం తీసుకువచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
మతాలపైవిమర్శలు చేసేవారు, విద్వేషాలు రెచ్చగొట్టేవారిని కఠినంగా అణిచివేసేందుకు వీలుగా కర్ణాటకలో కొత్త చట్టం తీసుకువచ్చారని.. అలాంటి చట్టమే తెలంగాణలోనూ తీసుకురానున్నట్టు సీఎం చెప్పారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిని ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. డిసెంబరు మాసానికి చాలా ప్రత్యేకత ఉందన్న సీఎం.. ఈ నెలలోనే తమ ప్రభుత్వం(2023) ఏర్పడిందన్నారు. ఇదే నెలలో ప్రభువు జన్మించారని.. అదేవిధంగా తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు కూడా ఈ మాసంలోనేనని రేవంత్ చెప్పారు. అనేక మందిప్రాణ త్యాగాలు సహా కాంగ్రెస్ పార్టీ `రాజకీయ త్యాగం` చేసి తెలంగాణ ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ద్వేషించేవారిని కూడా ప్రేమించాలన్న స్ఫూర్తి నింపిన ఏసు ప్రభు సందేశమే తమ ప్రభుత్వానికి స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ బోధనల స్ఫూర్తితోనే పాలన సాగిస్తున్నామన్నారు. ఆర్థికంగా,రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ ప్రభుత్వం సంక్షేమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కులాలు, మతాలకు అతీతంగా తాము సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా అమలవుతున్న పథకాల జాబితాను వివరించారు. ఇదే సమయంలో క్రైస్తవ మిషినరీల ఏర్పాటు.. దేశవ్యాప్తంగా అవి చేస్తున్న కృషిని సీఎం రేవంత్ వివరించారు. ప్రభుత్వంతో పోటీ పడి మరీ మిషినరీలు సేవలు అందిస్తున్నాయని కొనియాడారు.
This post was last modified on December 21, 2025 9:06 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…