Political News

పీపీపీ విధానాన్ని వ‌దులుకునే ప్ర‌సక్తే లేదంటున్న చంద్రబాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల ఎఫెక్ట్ జ‌గ‌న్‌పై భారీగా ప‌డుతోంద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. “`సూప‌ర్ సిక్స్‌` తో  జ‌గ‌న్ కు దిమ్మ తిరుగుతోంది“ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు.. పార్టీ ఎంపీల‌తో క‌లిసి లంచ్ బ్రేక్ తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎంపీల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. జ‌గ‌న్ ప‌రిస్థితి తీవ్ర ఇబ్బందిక‌రంగా ఉంద‌న్నారు. పార్టీలో నాయ‌కులు ఎవ‌రూ ఆయ‌న‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని చెప్పారు.

ఈ స‌మ‌యంలో జ‌గ‌న్‌కు ఏం చేయాలో తెలియ‌డం లేద‌ని.. అందుకే కోటి సంత‌కాల పేరుతో నాట‌కాలకు తెర‌దీశార‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. కానీ, ఆయ‌న పార్టీ ఎంపీ గురుమూర్తే.. వైద్య క‌ళాశాల‌ల‌ను పీపీపీకి ఇస్తే త‌ప్పులేద‌ని.. అలా ఇస్తే మెరుగైన ఫ‌లితాలు కూడా వ‌స్తాయ‌ని పార్ల‌మెంటులో నివేదిక స‌మ‌ర్పించారని చంద్ర‌బాబు తెలిపారు. ఈ విష‌యాన్ని పార్టీ ఎంపీలు కూట‌మి ఎంపీల‌కు కూడా వివ‌రించి.. పార్ల‌మెంటు వేదిక‌గా జ‌గ‌న్ నాట‌కాన్ని చెప్పాల‌ని.. అక్క‌డోమాట‌.. ఇక్క‌డో మాట మాట్లాడుతున్న తీరును ఎండ‌గ‌ట్టాల‌ని వ్యాఖ్యానించారు.

వైద్య క‌ళాశాల‌ల‌ను పీపీపీ విధానంలో అమ‌లు చేస్తున్న రాష్ట్రాలు అనేకం ఉన్నాయ‌ని, కేంద్ర ప్ర‌భుత్వం కూడా దీనిని ప్రోత్స‌హిస్తోంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. పార్ల‌మెంటులో ఈ విష‌యాన్ని లేవ‌నెత్తే ద‌మ్ములేక వైసీపీ రాష్ట్రంలో డ్రామాల‌కు తెర‌దీసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ డ్రామా కూడా విఫ‌ల‌మైంద‌ని.. అందుకే మ‌ళ్లీ బెంగ‌ళూరుకు పోయేందుకు రెడీ అయ్యాడ‌ని వ్యాఖ్యానించారు.

పీపీపీ విధానాన్ని వ‌దులుకునే ప్ర‌సక్తే లేద‌ని చంద్ర‌బాబు చెప్పారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ, ప్ర‌ధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్, మ‌హారాష్ట్ర‌ల్లో కూడా.. పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించార‌ని గుర్తు చేశారు. ఈ విష‌యాల‌ను పార్ల‌మెంటులో ప్ర‌స్తావించాల‌ని ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు.

This post was last modified on December 20, 2025 8:41 am

Share

Recent Posts

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

48 minutes ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

2 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

5 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

5 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

7 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

9 hours ago