Political News

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు ఈ విష‌యంలో ఒకింత తాత్సారం చేస్తాయి. కానీ, ఇటు టీడీపీ, అటు జ‌న‌సేన, మ‌రవైపు ప్ర‌తిప‌క్షం వైసీపీ కూడా ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ప్ర‌జ‌లను త‌మకు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. వైసీపీ పుంజుకునే అవ‌కాశాల‌పై ఇటీవ‌ల ఆ పార్టీ దృష్టి పెట్టింది. సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది.

మ‌రోవైపు.. టీడీపీ, జ‌న‌సేన పార్టీలు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు చేర‌డంలోను, ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌ల‌కు చేరువ చేయడంలోనూ ముందున్నాయి. త‌ర‌చుగా ప్ర‌జ‌ల మ‌ద్య‌కు వ‌స్తున్నాయి. వివిధ కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హిస్తున్నాయి. దీంతో ఆయా పార్టీ గ్రాఫ్ త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నాయి. చంద్ర‌బాబు.. ప‌వ‌న్‌లు ఈ విష‌యంలో దూకుడుగానే ఉన్నారు. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేందుకు కొంత వెనుక బ‌డి ఉంద‌న్న చ‌ర్చ అయితే సాగుతోంది. దీంతో ఆ పార్టీ ప్ర‌ణాళిక‌లు రూపొందించుకుంటోంది.

మూడు విధానాలు అవ‌లంభించాల‌ని వైసీపీ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. 1) గ‌తంలో చేసిన గ‌డ‌ప గ‌డ‌పకు కార్య‌క్ర‌మాన్ని తిరిగి ప్రారంభించడం. దీని ద్వారా వైసీపీ హ‌వాను పెంచుకునే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సంక్రాంతి త‌ర్వాత‌.. వైసీపీ నుంచి ఈ కార్య‌క్ర‌మం అమ‌లు కానుంది. ఇప్ప‌టికే నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో ప్ర‌జ‌ల నుంచి సానుభూతి వ‌స్తోంద‌ని చెబుతున్న నేప‌థ్యంలో గ‌డ‌ప‌-గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మం ద్వారా మ‌రింత పుంజుకోవాల‌ని భావిస్తున్నారు.

2) జ‌నంతో మ‌మేకం: ఇది వినూత్న కార్య‌క్ర‌మం. గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌తో స‌మావేశాలు, స‌భ‌లు నిర్వ‌హించ‌డం ద్వారా వైసీపీ ఓటు బ్యాంకును కాపాడు కోవాల‌న్నది వైసీపీ వ్యూహం. స్థానిక సమ‌స్య‌లు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుడుతున్నారు.

3) పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగ‌డం: ఇది ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా ప‌డుతున్నా.. ఈ ద‌ఫా మాత్రం పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే ప్లాన్ చేస్తున్నారు. మ‌రోవైపు.. సంక్రాంతి నుంచి జ‌న‌సేన‌, టీడీపీలు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉండ‌నున్నాయి. మొత్తంగా మూడు పార్టీల వ్యూహాలు.. ప్ర‌జ‌లను ఏమేర‌కు ప్ర‌భావితం చేస్తాయో చూడాలి.

This post was last modified on December 19, 2025 12:16 pm

Share
Show comments
Published by
Kumar
Tags: JaganYCP

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

8 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

8 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

9 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

9 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

12 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

13 hours ago