Political News

తెలంగాణ కాంగ్రెస్ పనితీరుపై చంద్రబాబు రివ్యూ

ఏపీలో వ‌చ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో నాయ‌కులు అలెర్టుగా ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు సూచించారు. శుక్ర‌వారం ఉద‌య‌మే పార్టీ నాయ‌కుల‌తో ఆయ‌న టెలీ కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. తాజాగా తెలంగాణలో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార పార్టీ సాధించిన విజ‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలో అదే ఫ‌లితం ఏపీలోనూ రావాల‌ని సూచించారు. టిడిపి శ్రేణులు… నాయకులు ప్రజలకు చేరువ కావాలన్నారు.

పార్టీ కార్యక్రమాలు.. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని సీఎం చంద్ర‌బాబు సూచించారు. వాస్త‌వానికి ఈ విషయాన్ని ఆది నుంచి సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాలకు, అదే విధంగా ప్రజల మధ్యకు వెళ్లాలని కూడా ఆయన తాజాగా మ‌రోసారి సూచిస్తున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం అవుతున్న క్రమంలో పార్టీ నాయకులు అందరూ అలెర్ట్ గా ఉండాలని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

పక్క‌నే ఉన్న తెలంగాణ‌లో ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం స‌న్న‌గిల్ల‌లేద‌న్న విష‌యం స్ప‌ష్టం అయింది. అదే ఫ‌లితం ఏపీలోనూ క‌నిపించాలి.. అని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. పార్టీ కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమాలకు సిద్ధపడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి సామాజిక భ‌ద్ర‌తా పింఛన్ల పంపిణీకి, ప్రభుత్వ కార్యక్రమాలకు అంద‌రూ హాజరు కావాల‌ని.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్టాల‌ని కూడా చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

ఈ మేరకు ఎమ్మెల్యేలు, కార్య‌క‌ర్త‌లు త‌మ త‌మ కార్య‌క్ర‌మాల్లో మార్పులు కూడా చేసుకోవాలని సీఎం చంద్ర బాబు సూచించారు. అంద‌రూ క‌లిస్తే.. తిరుగులేని విధంగా కూట‌మి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని.. గ్రామీణ ప్రాంతాల్లో చేప‌డుతున్న అభివృద్ధిని కూడా వివ‌రించాల‌ని తెలిపారు. త‌మకు సంబంధం లేద‌ని ఎవ‌రూ భావించ‌రాద‌ని కూడా చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

This post was last modified on December 19, 2025 10:57 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

49 minutes ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

52 minutes ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

1 hour ago

అభివృద్ధికి ఆటంకాలు ఎందుకు జగన్?

ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…

2 hours ago

ఎన్టీఆర్ అభిమాని పాడే మోసిన నందమూరి తనయులు

ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి…

5 hours ago

పాకిస్థాన్‌లో నో రిలీజ్… అయినా అక్క‌డ‌ బ్లాక్‌బ‌స్ట‌ర్

కొన్నేళ్ల నుంచి భార‌త్‌, పాకిస్థాన్ సంబంధాలు అంతంత‌మాత్రంగా ఉండ‌గా.. ఈ ఏడాది ఆరంభంలో ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌ర్వాత అవి పూర్తిగా…

6 hours ago