కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే ట్యాగ్ కూడా అంటగట్టారు. ఎక్కడ నోరు విప్పినా బూతులు మాట్లాడతారన్న ప్రచారం బలంగా సాగింది. ముఖ్యంగా జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా కూడా ఆయనకు పేరు ఉంది. అలాంటి నాయకుడు గత ఎన్నికల్లో తొలిసారి పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే అయినా, నాని మాత్రం ఇప్పటివరకు ఓడిందే లేదన్న భావనలోనే ఉండేవారు.
కానీ గత ఎన్నికల్లో కూటమి హవాతో పాటు, కొడాలిపై కమ్మ సామాజిక వర్గం ఆగ్రహం కూడా కలిసి రావడంతో ఆయన పరాజయం తప్పలేదు. మరి ఇప్పటికైనా ఆయనలో మార్పు కనిపిస్తోందా అంటే, వ్యక్తిగతంగా పెద్దగా మార్పు కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇదే నియోజకవర్గంలో ప్రభావం చూపుతోందని అంటున్నారు. ప్రస్తుతం గత 18 నెలలుగా ఆయన యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్యం, గుండె ఆపరేషన్ కారణంగా కొడాలి ప్రత్యక్ష రాజకీయాలకు విరామం ఇచ్చారు.
ఇంకా కనీసం ఆరు నెలల వరకు కొడాలి యాక్టివ్ పాలిటిక్స్ చేసేందుకు సిద్ధంగా లేరని సమాచారం. ఇదిలా ఉండగా, వచ్చే ఎన్నికల్లో కొడాలిని రీప్లేస్ చేస్తారన్న చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ రంగం సిద్ధం చేస్తున్నారని కూడా చెబుతున్నారు. బలమైన ఆర్థిక మద్దతుతో పాటు క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడి కోసం పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్న సమాచారం ఉంది. ఈ క్రమంలో సినీ రంగానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం వ్యక్తితో చర్చలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చిరంజీవిని అవమానించారన్న చర్చ వచ్చినప్పుడు, ఆ నిర్మాత బహిరంగంగా స్పందించి వైసీపీకి మద్దతుగా మాట్లాడారు. తమకు ఎలాంటి అన్యాయం జరగలేదని స్పష్టం చేశారు. ఈయన గోదావరి జిల్లాలకు చెందిన నిర్మాతగా చెబుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా యాక్టివ్‌గా ఉంటారన్న పేరు కూడా ఉంది. ఆయనను చూస్తే థ్రిల్, దిల్ రెండూ కనిపిస్తాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈయనతో జగన్ చర్చించినట్టు సమాచారం.
అదే సమయంలో ఈయన కాకపోతే, గతంలో యాక్టివ్ పాలిటిక్స్ చేసి ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న మరో పారిశ్రామికవేత్తతో కూడా జగన్ చర్చలు జరిపినట్టు చెబుతున్నారు. వీరిద్దరిలో ఒకరికి టికెట్ ఖాయమయ్యే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. అయితే కొడాలి నానికి పార్టీలో కీలక పదవి అప్పగించే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 18, 2025 2:02 pm
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…