చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా అడిగితే టక్కున… వైయస్ జగన్ అని సమాధానం ఇస్తారు. అన్నాచెల్లెళ్ల మధ్య దూరం అంతలా పెరిగిపోయింది. జగన్ విషెస్ చెప్పలేదు సరే… షర్మిలకు కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ శుభాకాంక్షలు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
జగనన్నను వదిలి బాణాన్ని అంటూ ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల, ఆ తర్వాతి పరిణామాలతో వైసీపీకి దూరమయ్యారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కొంతకాలం నడిపించారు. అనూహ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. జగన్ ఓటమికి ఆమె కూడా ఒక కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది.
జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం కూడా నడుస్తోంది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వాటాల బదిలీ అంశంపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. షర్మిల పలు సార్లు తనకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే, కూటమి గెలిచిన తొలి రోజుల నుంచే కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా ఉన్న వైఎస్ షర్మిల తక్కువ మోతాదులో రాజకీయపరమైన విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి షర్మిల అనుకూలంగా ఉన్నారని కొంతకాలం వైసీపీ కూడా విమర్శలు చేసింది. అదేమీ పట్టించుకోకుండా గత వైసీపీ విధానాలను మాత్రం షర్మిల ఎప్పుడూ ఎండగడుతూనే ఉన్నారు. అధిష్టానం నుంచి సూచనలు అందినట్లు సమాచారం. ఈ మధ్య కూటమి ప్రభుత్వంపై కూడా ఆమె విమర్శల ఘాటు కొద్దిగా పెంచారు.
ఈ క్రమంలో ఆమెకు ముగ్గురు నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఆసక్తిగా మారింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆమెకు విషెస్ చెప్పగా… థ్యాంక్యూ అంటూ ఆమె రిప్లై ఇచ్చారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా షర్మిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అన్న జగన్ మాత్రం ఆమెకు విషెస్ చెప్పకపోవడం అభిమానుల్లో కూడా చర్చకు దారి తీసింది.
This post was last modified on December 17, 2025 8:23 pm
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…
ప్రపంచం మొత్తంలో ఉన్న ఫిలిం మేకర్స్ ఆరాధనాభావంతో చూసే దర్శకుడు జేమ్స్ క్యామరూన్. అవతార్ అనే ఊహాతీత లోకాన్ని సృష్టించి…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ దర్శకుడు ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో…
తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఒక యువ దర్శకుడు హఠాత్తుగా కన్నుమూశాడు. తన పేరు కిరణ్…