బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తాజాగా రెండోసారి తన కుమార్తె బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్‌షన్‌కు గురైన కవిత పై స్పందించారు. ఇటీవల కవితపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అదేవిధంగా నిరంజన్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో కవిత మీడియా ముందుకు వచ్చి పదే పదే బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేయడంతో పాటు తనను కెలకద్దంటూ వ్యాఖ్యానించారు. అన్ని ఆధారాలు బయటపెడతానని తాను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతానని అప్పుడు విచారణ చేయిస్తానని కూడా అన్నారు.
తాజాగా ఈ విషయాలుపై పలువురు నాయకులు కేసీఆర్ కు వివరించారు. ఆదివారం సాయంత్రం జరిగిన అంతర్గత సమావేశంలో కవిత చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ కూడా లైట్ గానే స్పందించినట్లు తెలిసింది. ఎందుకు ఆవిడ గురించి అనవసరంగా మాట్లాడతారని మాధవరం కృష్ణారావును ఉద్దేశించే ప్రధానంగా కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాజకీయాల్లో ఇలాంటివన్నీ సాధారణమేనని, ఇప్పటివరకు తాను అనేకమంది నాయకులను చూశానని, ఎంతోమంది నాయకులు ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చి విఫలమైన వాళ్ళు చాలామంది ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఇలాంటి వారిని మనం హైలెట్ చేసి అనవసరంగా వాళ్ళ గ్రాఫ్ పెంచడం ఎందుకు అని కూడా కేసీఆర్ ప్రశ్నించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అసలు అలాంటి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. మనం ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు అని ఆయన వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి, కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే కవిత విషయాన్ని ప్రస్తావించిన కెసిఆర్ అసలు ఇలాంటి వాళ్ల గురించి మాట్లాడవద్దని చెప్పినట్టు కూడా తెలిసింది,
ఏదేదో అనుకుంటే వాటికి మనం బాధ్యులం కాదని, ఏది ఉన్నా ప్రజలు తెలుస్తారని, అసలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయకపోవడంతోనే తమపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన పరోక్షంగా కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టు సమాచారం. మొత్తంగా గతంలో కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ ఇదే వ్యాఖ్యలు చేశారు. కవితను అనవసరంగా పట్టించుకుంటున్నారని, దానికన్నా ప్రజల మధ్య ఉంటే మనకు మేలు జరుగుతుందని పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే వ్యాఖ్యలు చేసి కవిత గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. మరి దీంతో ఇక కవిత గురించి నాయకులు మాట్లాడతారా లేదా అనేది చూడాలి.
This post was last modified on December 16, 2025 8:49 pm
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…
ప్రపంచం మొత్తంలో ఉన్న ఫిలిం మేకర్స్ ఆరాధనాభావంతో చూసే దర్శకుడు జేమ్స్ క్యామరూన్. అవతార్ అనే ఊహాతీత లోకాన్ని సృష్టించి…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ దర్శకుడు ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో…
తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఒక యువ దర్శకుడు హఠాత్తుగా కన్నుమూశాడు. తన పేరు కిరణ్…
వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్…
2009లో ప్రపంచ సినీ చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘అవతార్’. ఆ సినిమాకు కొనసాగింపుగా ఏకంగా…