Political News

బాబు స్పెషల్: శాంతి వనంలోనూ పెట్టుబడుల ధ్యానం!

ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల రాక, ఉద్యోగాలు, ఉపాధి కల్పన వంటి కీలక అంశాలపైనే దృష్టి పెడుతున్నారు. విదేశాలకు కూడా వెళ్లి పెట్టుబడి సంస్థలను ఆహ్వానిస్తున్నారు. పెట్టుబడుల సదస్సులు నిర్వహించి, రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ తాజాగా సీఎం చంద్రబాబు హైదరాబాద్ లోని కన్హా శాంతి వనాన్ని సందర్శించారు.

ఇది పూర్తిగా యోగా, ధ్యానం, ప్రకృతి చికిత్సలకు మాత్రమే పరిమితమైన ప్రాంతం. అయినప్పటికీ సీఎం చంద్రబాబు ఇక్కడ కూడా పెట్టుబడులపైనే ఆలోచన చేశారు. ఏపీలో కూడా ఇలాంటి శాంతి వనాన్ని ఏర్పాటు చేసే అంశంపై కన్హాను నిర్వహిస్తున్న శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి. పటేల్ దాజీతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీలోని అమరావతి, విశాఖలో ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనను ఆయన వెల్లడించారు. ప్రభుత్వ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు.

ముఖ్యంగా మిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న హార్ట్ ఫుల్ నెస్ కేంద్రాన్ని చంద్రబాబు సందర్శించారు. ఇలాంటి కేంద్రాన్ని అమరావతిలో కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్నాళ్ల కిందట విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా కార్యక్రమం విజయవంతమైన తీరు, దీనికి ప్రపంచ స్థాయిలో వచ్చిన రికార్డులు, అవార్డులను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఏపీలోనూ శాంతి వనం తరహా ప్రాజెక్టు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

విశాఖలో యోగా కేంద్రం, అమరావతిలో హార్ట్ ఫుల్ నెస్ కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తానికి సీఎం చంద్రబాబు ఎక్కడ ఉన్నా పెట్టుబడులపైనే ధ్యానం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుండటం గమనార్హం.

This post was last modified on December 15, 2025 4:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

#AskKavitha.. కవిత కొత్త పంథా!

బీఆర్ ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత.. సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించిన…

32 minutes ago

దురంధర్ దర్శకుడిది భలే స్టోరీ గురు

ఆదిత్య ధర్.. ఇప్పుడు బాలీవుడ్లోనే కాక, దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశం అవుతున్న పేరిది. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా…

54 minutes ago

8 గంటల పని… దీపికకు వ్యతిరేకంగా భర్త

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పిరిట్, కల్కి-2 చిత్రాల నుంచి తప్పుకోవడం ఆ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి…

2 hours ago

సీఎం వచ్చినా తగ్గేదేలే అంటున్న ఉద్యమకారులు

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణను తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్పీ బాలు తెలంగాణ…

3 hours ago

మోదీ, రేవంత్, లోకేష్ కు కూడా తప్పని ఢిల్లీ తిప్పలు

ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమాన, రైలు రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. విజిబిలిటీ భారీగా తగ్గిపోవడంతో పలు విమానాలను దారి…

3 hours ago

ఒక్క ఓటుతో కోడల్ని గెలిపించిన ‘అమెరికా మామ’

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఫలితాలు నిన్న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల ఫలితాల…

3 hours ago