హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణను తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్పీ బాలు తెలంగాణ పదం ఉచ్చరించడానికి నిరాకరించారని, తెలంగాణ గడ్డపై ముందుగా అందె శ్రీ, గద్దర్ వంటి స్థానిక కళాకారులకు, ఉద్యమకారులకు గౌరవం దక్కాలని వారు వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
దీంతో, రవీంద్ర భారతి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. అయితే, సీఎం వచ్చినా సరే ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని, తగ్గేదే లే అని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్విరాజ్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను ఎన్ని రోజులు కాపలా పెడతారో చూస్తామని ఆయన హెచ్చరించారు. ఏపీలో తెలంగాణ కళాకారులకు గుర్తింపు ఉందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దివంగత సీఎం రోశయ్య విగ్రహం పెట్టారని, కానీ, చెన్నారెడ్డి, అంజయ్య వంటి తెలంగాణకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రుల విగ్రహాలు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరుల ఆత్మ వంచన జరుగుతోందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ కవులను బొంద పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కవులు, సాహిత్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోందని ఫైర్ అయ్యారు. కాగా, ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా హాజరు కాబోతున్నారు.
This post was last modified on December 15, 2025 4:06 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…