తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్ పై నమ్మకం పెట్టుకున్న ప్రజలు లోకల్ వార్ లో కూడా హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించారు. ఇక, నేడు జరిగిన రెండో దశ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 784 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. అయితే, రెండో దశ ఫలితాల్లోనూ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పోటీనివ్వలేకపోయింది. 312 స్థానాల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ బలపరిచిన 93 మంది అభ్యర్థులు గెలిచారు. మరో 250 స్థానాల్లో ఇతరులు, ఇండిపెండెంట్లు, రెబల్స్ విజయం సాధించారు.
రెండో దశకు జరిగిన పోలింగ్ లో సుమారు 82 శాతం ఓటింగ్ నమోదైంది. ఆదివారం కావడంతో ఓటు వేసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండో విడత పోలింగ్ లో మొత్తం 193 మండలాల్లో 3911 గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు, 29917 వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరిగింది.
మూడో దశ ఎన్నికలు ఈ నెల 17వ తేదీన జరగనున్నాయి. మూడో దశలో182 మండలాల్లోని 4159 గ్రామాలు, .36452 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మూడు దశల్లో 12728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
This post was last modified on December 14, 2025 8:27 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…