ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పలు వీడియోలు.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా యూట్యూబ్ రీల్స్‌గా.. ఇటు సోషల్ మీడి యాలోనూ వస్తున్నాయి. అయితే.. వీటిని పూర్తిగా తొలగించాలని.. సదరు లింకుల కారణంగా.. తన వ్యక్తిగత హక్కులకు తీవ్ర భంగం ఏర్పడుతోందని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి కీలక ఉత్తర్వులు తెచ్చుకున్నారు.
పవన్ కల్యాణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సోషల్ మీడియా సహాయూ ట్యూబ్‌లలో ఉన్న ఈ వీడియోల ద్వారా.. వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడం.. శిక్షార్హమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఉన్న పవన్ కల్యాణ్ కు చెందిన అభ్యంతరకర వీడియో లను వారం రోజుల్లో తొలగించాలని యూట్యూబ్, సోషల్ మీడియా వేదికలకు ఆదేశాలు జారీ చేసింది.
అదేసమయంలో తాము కూడా ఆయా లింకులను పరిశీలిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోకు రెండు రోజుల్లో ఆయా అభ్యంతర లింకులను ఇవ్వాలని పిటిషనర్‌ను కోరింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఇదిలావుంటే.. పవన్ కల్యాణ్ గతంలో ఎన్నికలకు ముందు చేసిన వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న వ్యాఖ్యలకు.. గతంలో చేసిన కామెంట్లకు లింకు పెడుతున్నారు.
దీంతో గతంలో చేసిన వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ పవన్ కల్యాణ్ కోర్టును ఆశ్రయించారు. ఇక, వాస్తవానికి ఏపీ హైకోర్టును ఆశ్రయించకుండా.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం వెనుక కూడా కారణం ఉంది. సోషల్ మీడియా వేదికలకు సంబంధించిన ఎలాంటి వివాదమైనా.. ఆయా దేశాల రాజధాని పరిధిలోని కోర్టులకే వర్తిస్తుంది. అందుకే.. పవన్ కల్యాణ్.. ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సో.. మొత్తంగా మరో వారంలో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన `లింకులు` కనిపించవన్న మాట.
This post was last modified on December 12, 2025 5:05 pm
ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఒక్కోసారి రీ రిలీజులకు సరైన స్పందన రాదు. కొన్ని మాత్రం ఏకంగా రికార్డులు సాధించే…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ముగింపు లేని కథగా మారుతోంది. అఖండ 2 జిఓని రద్దు చేస్తూ నిన్న హైకోర్టు…
గత వారం విడుదలైన దురంధర్ స్టడీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 లాంటి క్రేజీ రిలీజ్ ఉన్నా సరే…
రాజకీయాల్లో తప్పులు చేయడం సహజం. వాటిని సరిదిద్దుకునేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు నడవడం కీలకం!. ఇది కేంద్రం నుంచి రాష్ట్రం…
తెలంగాణలో పెద్ద సినిమాలకు టికెట్ల ధరలు పెంచడం, బెనిఫిట్ షోలు వేయడం గురించి ఏడాది కిందట్నుంచి పెద్ద చర్చే జరుగుతోంది. కాంగ్రెస్…
"తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఎందుకు మనం నానాటికీ దిగజారుతున్నాం." ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ సంధించిన ప్రశ్న. దీనికి…