Political News

తప్పు జరిగిందని జగన్ ఒప్పుకున్నారా?

రాజ‌కీయాల్లో త‌ప్పులు చేయ‌డం స‌హ‌జం. వాటిని స‌రిదిద్దుకునేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకుని ముందుకు న‌డ‌వ‌డం కీల‌కం!. ఇది కేంద్రం నుంచి రాష్ట్రం వ‌ర‌కు అంద‌రు నాయ‌కుల‌కు, పార్టీల‌కు కూడా వ‌ర్తించే సూత్రం. వైసీపీ ఇప్పుడు ఇదే బాట ప‌డుతుందా? లేదా? అనేది చూడాలి. అయితే.. ఒక్క‌టి మాత్రం వాస్త‌వం.. త‌ప్పులు చేశామ‌ని పార్టీ అధినేత జ‌గ‌న్ తొలిసారి అంగీక‌రించారని వార్తలొస్తున్నాయి. గత ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. ప్ర‌తి సారీ ద‌బాయిస్తూ.. వ‌చ్చిన ఆయ‌న తాజాగా తొలిసారి త‌ప్పు జ‌రిగింది.. అని పార్టీ నేత‌ల‌కు చెప్పారని సమాచారం.

వివిధ కార్పొరేష‌న్లు, మునిసిపాలిటీల‌ను కోల్పోతున్న త‌రుణంలో జ‌గ‌న్ ఆయా అంశాల‌పై పార్టీ నేత‌ల‌తో గురువారం అంత‌ర్గ‌త స‌మావేశం నిర్వ‌హించారు. ఇది పూర్తిగా హాట్ డిబేట్‌గా న‌డిచిందని తెలిసింది. ఈ స‌మావేశానికి అత్యంత స‌న్నిహితులైన కొంద‌రిని మాత్ర‌మే పిలిచారు. అదేస‌మ‌యంలో తాను రాసి పెట్టుకున్న అంశాల‌ను కూడా జ‌గ‌న్ వారికి వివ‌రించారు. ఈ స‌మ‌యంలోనే గ‌త ఎన్నిక‌ల్లో త‌ప్పులు జ‌రిగాయ‌ని జ‌గ‌న్ అంగీక‌రించారు.

“కొన్ని కొన్ని నాకు తెలియ‌కుండా చేశారు. నేను కూడా అంద‌రినీ న‌మ్మేశాను. ఇది త‌ప్పు. కొంద‌రిని మనం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయించుకోలేక‌పోయాము. కొన్ని విష‌యాల‌ను కొంద‌రు నాదాకా తీసుకురాలేక పోయారు. త‌ప్పులు జ‌రిగిన త‌ర్వాత‌ కూడా కొంద‌రు అంతా బాగుంద‌ని చెప్పారు. ఇది మ‌న‌కు న‌ష్టం తెచ్చింది.“ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించిన‌ట్టు అత్యంత విశ్వ‌సనీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. అయితే.. ఎన్నిక‌ల్లో ఓట‌మిని మాత్రం ఇప్ప‌టికీ జ‌గ‌న్ అంగీక‌రించ‌లేక పోతున్నార‌ని వారు చెబుతున్నారు.

కానీ.. త‌ప్పులు జ‌రిగాయ‌ని మాత్రం చెప్పుకొచ్చారు. బ‌ల‌మైన నాయ‌కుల‌ను దూరం చేసుకున్నామ‌న్న చ‌ర్చ కూడా పార్టీలో జ‌రిగిన‌ట్టు తెలిపారు. కానీ.. వారిని వెన‌క్కి తీసుకువ‌చ్చేందుకు అవ‌కాశం లేద‌ని.. ఆ అవ‌స‌రం కూడా లేద‌ని జ‌గ‌న్ చెప్పిన‌ట్టు తెలిసింది. “వెళ్లిన వారిని వెన‌క్కి తీసుకురావ‌డం లేదు. ఇప్పుడు కావాల్సింది.. చూడండి. మీకు స్వేచ్ఛ‌(ఫ్రీ హ్యాండ్‌) ఇచ్చాను. ఇక‌, మీ ఇష్టం“ అని వారితో చెప్పిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి త‌ప్పు అయితే జ‌రిగింద‌ని జ‌గ‌న్ ఒప్పుకోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. భ‌విష్య‌త్తు ఏంట‌న్న‌ది మాత్రం ఆయ‌న ఇంకా తేల్చ‌లేద‌ని తెలిసింది.

This post was last modified on December 12, 2025 3:17 pm

Share
Show comments
Published by
Kumar
Tags: YS Jagan

Recent Posts

పాతికేళ్ళయినా తగ్గని పడయప్ప క్రేజ్

ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఒక్కోసారి రీ రిలీజులకు సరైన స్పందన రాదు. కొన్ని మాత్రం ఏకంగా రికార్డులు సాధించే…

2 hours ago

ఇక‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ `లింకులు` క‌నిపించ‌వు!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సంబంధించిన ప‌లు వీడియోలు.. సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్న…

3 hours ago

టికెట్ రేట్ల పెంపు – అంతులేని కథ

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ముగింపు లేని కథగా మారుతోంది. అఖండ 2 జిఓని రద్దు చేస్తూ నిన్న హైకోర్టు…

3 hours ago

దురంధర్ కొట్టిన దెబ్బ చిన్నది కాదు

గత వారం విడుదలైన దురంధర్ స్టడీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 లాంటి క్రేజీ రిలీజ్ ఉన్నా సరే…

5 hours ago

టికెట్ల రేట్లపై తేల్చి చెప్పిన మంత్రి

తెలంగాణలో పెద్ద సినిమాలకు టికెట్ల ధరలు పెంచడం, బెనిఫిట్ షోలు వేయడం గురించి ఏడాది కిందట్నుంచి పెద్ద చర్చే జరుగుతోంది. కాంగ్రెస్…

6 hours ago

రాజాసింగ్ చెప్పిందే నిజమైందా?

"తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఎందుకు మనం నానాటికీ దిగజారుతున్నాం." ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ సంధించిన ప్రశ్న. దీనికి…

6 hours ago