“తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఎందుకు మనం నానాటికీ దిగజారుతున్నాం.” ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ సంధించిన ప్రశ్న. దీనికి బీజేపీ ఎంపీల దగ్గర సమాధానం లేకుండాపోయింది. కేవలం ఒకరిద్దరు నాయకుల మధ్య బంధీ అయిన అధికారం ఆధిపత్యం కారణంగానే తెలంగాణలో బీజేపీ నానాటికీ తీసికట్టుగా మారుతోందన్నది నిజం. ఎవరికివారు పెద్దలుగా మారి పార్టీ లైన్‌ను విస్మరించిన ఫలితంగానే ప్రజలకు చేరువ కావాల్సిన పార్టీ జారుబండిపై ప్రయోగాలు చేస్తోంది.
ఈ విషయాన్ని ఎవరికైనా ఇష్టం ఉన్నా కష్టంగా అనిపించినా ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గత ఆరు నెలల క్రితమే చెప్పారు. పార్టీని సంస్కరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. అయితే ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఆయనను బయటకు వెళ్లేలా చేశారన్న వాదన కూడా ఉంది. కానీ ప్రస్తుతం ప్రధాని వరకూ రాష్ట్ర రాజకీయాలు చేరి ప్రశ్నలు తలెత్తే దాకా రావడం వెనుక ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా మారింది.
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని భావించిన పార్టీ ఆ దిశగా అడుగులు వేయడంలో తడబడుతోందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. బండి సంజయ్ పార్టీ చీఫ్‌గా ఉన్నప్పుడు ఉన్న వేగం మరియు రాజకీయ దూకుడు ఇప్పుడు కనిపించడంలేదు. పార్టీ అధిష్టానం చీఫ్‌ను మార్చినా తెర వెనుక సాగుతున్న ఆధిపత్య రాజకీయాలను మాత్రం తగ్గించలేకపోయింది. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి నిర్ణయాలను మరొకరు అనుసరించే పరిస్థితి కూడా లేదు. కిషన్ రెడ్డితో కొందరికి పడదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈటల రాజేందర్, బండి సంజయ్, మాధవీలత, కిషన్ రెడ్డి వంటి కొద్దిమంది మాత్రమే బీజేపీలో నాయకత్వంగా ముందుకు వస్తున్నారు. క్షేత్రస్థాయి కమిటీల ఏర్పాటు మరియు నాయకులను సమన్వయం చేయడంలో విఫలమవడం పార్టీకి నష్టాలుగా మారుతోంది. ఈ కారణంగానే పార్టీ దెబ్బతింటోందన్న వాదన నిజమే. ఇదే విషయాన్ని అప్పుడే రాజాసింగ్ చెప్పారు. ఒక్కరికోసం పార్టీనా లేక అందరికోసం పార్టీనా అని ప్రశ్నించారు. అప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ విషయం ప్రధాని దాకా చేరే వరకు నాయకులు ఏం చేశారన్నది ప్రశ్నగా మారింది.
ఇప్పటికైనా పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తారా లేదా అనేది చూడాలి.
This post was last modified on December 12, 2025 2:02 pm
ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…
తెలుగులో చాలా వేగంగా అగ్ర కథానాయికగా ఎదిగి.. కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్. కానీ వరుస…
ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఒక్కోసారి రీ రిలీజులకు సరైన స్పందన రాదు. కొన్ని మాత్రం ఏకంగా రికార్డులు సాధించే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పలు వీడియోలు.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ముగింపు లేని కథగా మారుతోంది. అఖండ 2 జిఓని రద్దు చేస్తూ నిన్న హైకోర్టు…
గత వారం విడుదలైన దురంధర్ స్టడీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 లాంటి క్రేజీ రిలీజ్ ఉన్నా సరే…