Political News

దేశ చరిత్రలోనే మొదటిసారి – యూనివర్సిటీకి 1000 కోట్లు!

హైద‌రాబాద్‌లోని చ‌రిత్రాత్మ‌క విశ్వ‌విద్యాల‌యం.. ఉస్మానియా యూనివ‌ర్సిటీ(ఓయూ). అనేక మంది మేధావుల‌ను మాత్ర‌మే ఈ దేశానికి అందించ‌డం కాదు.. అనేక ఉద్య‌మాల‌కు కూడా ఈ విశ్వ‌విద్యాల‌యం నిలువెత్తు సాక్ష్యం. ముఖ్యంగా తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మ సమ‌యంలో ఇక్క‌డి విద్యార్థులు కీల‌క రోల్ పోషించారు. అలాంటి విశ్వ‌విద్యాల‌యానికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రూ.1000 కోట్ల నిధుల‌ను ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ఆ వెంట‌నే జీవోను కూడా జారీ చేశారు.

సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌.. తొలిసారి బుధ‌వారం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివ‌ర్సిటీకి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తొలుత విద్యార్థుల‌తో భేటీ అయ్యారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు క‌ల్పిస్తామ‌న్నారు. ఈ క్ర‌మంలోనే 1000 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే ఉన్న‌త విద్యా శాఖ జీవో కూడా ఇచ్చేసింది. ఈ నిధుల‌ను విశ్వ‌విద్యాల‌యం అభివృద్ధికి వినియోగించ‌నున్న‌ట్టు ముఖ్య‌మంత్రి చెప్పారు.

విద్యార్థుల‌కు రాజ‌కీయాలు అవ‌స‌ర‌మే కానీ.. ఎవ‌రి ఉచ్చులో బ‌డితే.. వారి ఉచ్చులో చిక్కుకోవద్ద‌ని ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఉస్మానియా విద్యాల‌యానికి ఒక చారిత్ర‌క నేప‌థ్యంలో ఉందన్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో విద్యార్థులు కీల‌క పాత్ర పోషించార‌ని చెప్పారు. అదేస్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలోకి న‌డిపించేందుకు కూడా విద్యార్థులు స‌హ‌క‌రించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అన‌వ‌స‌ర రాజ‌కీయ వివాదాల్లోకి చిక్కుకోవ‌ద్ద‌ని సీఎం సూచించారు.

“ఓయూకి వ‌స్తానంటే.. కొంద‌రు వారించారు. ఎందుక‌ని కూడా ప్ర‌శ్నించారు. కానీ, నేను అభిమానంతో ఇక్క‌డ‌కు వ‌చ్చాను. మ‌న రాష్ట్ర భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌ను ఇక్క‌డ నుంచే రాసుకునేందుకు వ‌చ్చా“ అని విద్యార్థుల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఎదిగేందుకు ప్ర‌భుత్వం ఎంత చేయాలో అంతా చేస్తుంద‌ని సీఎం వివ‌రించారు. రాష్ట్రానికి, ప్ర‌పంచానికి కూడా ఓయూ విద్యార్థులు ఐకాన్‌లుగా మారాల‌న్నదే త‌న సంక‌ల్ప‌మ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు.

This post was last modified on December 11, 2025 8:05 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

32 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

51 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago