తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేసిన ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదు, ముంబైలో చికిత్స పొందారు. కొంతకాలంగా అడపా దడపా కొన్ని కార్యక్రమాల్లో కనిపిస్తున్న అంత యాక్టివ్ గా లేరు. ఈరోజు మీడియా ముందుకు వచ్చి కొద్దిరోజుల్లో తాను పూర్తిస్థాయి రాజకీయ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటించారు.
మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఇటు అసెంబ్లీ సమావేశాల్లోనూ, అటు మీడియా సమావేశాల్లోనూ చేసిన వ్యాఖ్యలను టీడీపీ పార్టీ నేతలు మర్చిపోలేకపోతున్నారు. ఆ వ్యాఖ్యలపై కొన్నిసార్లు కేసులు కూడా నమోదు అయ్యాయి. ఆయన అరెస్టు ఎంతో దూరం లేదంటూ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అంతలోనే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన తెర వెనుకే ఉన్నారు.
ఈరోజు గుడివాడలో కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. బైపాస్ సర్జరీ కావడం వల్ల ఆరు నెలలు రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఇప్పటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొంటాను. మళ్ళీ జగన్ ను సీఎం అవ్వడానికి నా వంతు కృషి చేస్తా అని వెల్లడించారు.
అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేష్ అక్కడ అభిమానులు కొడాలి నాని గురించి అడిగారు. ఎలాంటి డౌట్ వద్దంటూ వారికి లోకేష్ వివరించారు. కొడాలి నాని రాజకీయంగా పూర్తి స్థాయిలో ఆక్టివ్ అవుతారా..? అలా అవగానే ఆయన అరెస్టు తప్పదా..? అని తెలుగుదేశం శ్రేణులు చర్చించుకుంటున్నారు. నాని మళ్లీ రాజకీయాల్లో దూకుడుగా ఉంటారా… ? అనేది కూడా వేచి చూడాలి.
This post was last modified on December 10, 2025 2:23 pm
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…