తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్ సిటీలో ఆవిష్కరించారు. ఇటీవల కాలంలో చెబుతున్న తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిష్కరించడమే ధ్యేయంగా ఈ విజన్ డాక్యుమెంటును రూపొందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ విజన్ డాక్యుమెంటు తెలంగాణ బలోపేతం కోసం రూపొందించామన్నారు. ఈ డాక్యుమెంటు కోసం.. ప్రజలనుంచి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. దీనిలో 4 లక్షల మందికి పైగా ప్రజలు పార్టిసిపేట్ చేసితమ అభిప్రాయాలు పంచుకున్నారని చెప్పారు.
తెలంగాణ ప్రాంతానికి జమీన్-జంగిల్ ఉద్యమంతో ప్రారంభమైన చరిత్ర ఉందన్నారు. తెలంగాణకు అనేక రూపాల్లో శక్తి సామర్థ్యాలు ఉన్నా.. ఇప్పటి వరకు వాటిని నిరూపించుకునేందుకు అవకాశం రాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ రైజింగ్ డాక్యమెంటును తీసుకువచ్చామన్నారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిపోయినా.. తెలంగాణ అభివృద్ధి ఎక్కడికక్కడే ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉజ్వల భవితను నిర్దేశించేలా.. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో 2047 నాటికిరాష్ట్రాన్ని అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో ముందుకు తీసుకువెళ్లాలన్నదే ఈ డాక్యుమెంటు లక్ష్యమన్నారు.
ఈ ఆశయం.. తన ఒక్కరి నిర్ణయమే కాదని.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ డాక్యుమెంటు రూపకల్పనలో .. మేధావుల నుంచి ఆర్థిక నిపుణుల వరకు.. సామాన్యులను కూడా దీనిలో భాగస్వామ్యం చేశామన్నారు. ప్రగతి డాక్యుమెంటును తెలంగాణ ప్రజలకు అంకితం చేయనున్నామన్నారు.
మహిళలు, రైతులు, సాధారణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేస్తామన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్రం వచ్చాక.. మొదటి ప్రధాని నెహ్రూ.. మహాత్మా గాంధీలకు మధ్య జరిగిన సంభాషణను సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఈ క్రమంలోనే విద్య, వ్యవసాయానికి ప్రాధాన్యం లభించిందన్నారు. ఈ కారణంగానే నాగార్జున సాగర్ సహా.. అనేక ప్రాజెక్టులు.. విద్యాసంస్థలు వచ్చాయన్నారు.
ఈ స్ఫూర్తితోనే తాము కూడా.. విద్య, వ్యవసాయం, సాంకేతికతను ప్రాధాన్యంగా తీసుకున్నామన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు సరైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. విజన్ డాక్యుమెంటులో ఈ విషయాలను స్పష్టం చేశామన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇదేసమయంలో పేదరికాన్ని.. అస్పృశ్యతను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. కాగా.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5, 39, 495 కోట్లు పెట్టుబడులుగా వచ్చాయి.
This post was last modified on December 9, 2025 9:32 pm
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…
అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే…