Political News

అమెరికాలోనూ ఆగని లోకేష్ పెట్టుబడుల వేట

అమెరికాలో ప్ర‌ఖ్యాత శాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ ప‌ర్య‌టించారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ రోజు ఉద‌యం ఆయ‌న శాన్‌ఫ్రాన్సిస్కోకు చేరుకున్నారు. తొలుత ఆయ‌న ప‌లువురు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌ల‌తో భేటీ అయ్యారు. అమ‌రావ‌తి స‌హా ఏపీలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని వారిని కోరారు. ఏపీ అభివృద్ధి బాట‌లో పురోగ‌మిస్తోంద‌ని.. ఇప్ప‌టికే ప‌లువురు పెట్టుబ‌డి దారులు వ‌స్తున్నార‌ని, ఒప్పందాలు కూడా జ‌రిగాయ‌ని ఆయ‌న వివ‌రించారు. ముఖ్యంగా ఎన్నారైల‌తో నారా లోకేష్ భేటీ అయి .. పెట్టుబ‌డుల‌పై చ‌ర్చించారు.

విశాఖ‌లో డేటా కేంద్రం వ‌చ్చిన‌ట్టు నారా లోకేష్ వారికి తెలిపారు. దీనివ‌ల్ల ల‌క్ష‌ మందికి ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయన్నారు. అదేవిధంగా అమెరికాలో క్వాంట‌మ్ వ్యాలీకి కూడా శ్రీకారంచుట్టామ‌న్నారు. ప‌ర్యాట‌కంగా, పారిశ్రామికంగానే కాకుండా.. ఐటీ ప‌రంగా కూడా రాష్ట్రంలో ఇప్పుడు పెట్టుబ‌డులకు మ‌రిన్ని అవ‌కాశాలు ఏర్పాడ్డాయ‌ని తెలిపారు. ప్ర‌తి విష‌యంలోనూ ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందిస్తుంద‌న్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిలో భారీ భూమి అందుబాటులో ఉంద‌న్నారు. పెట్టుబ‌డుల‌తో వ‌చ్చే వారికి అన్ని విధాలా స‌హకారం అందిస్తామ‌ని వివ‌రించారు.

ఐటీ స‌హా మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న రంగానికి ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు చెప్పారు. ఏపీలో డెవ‌ల‌ప్ మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జ‌న‌ర‌ల్ శ్రీక‌ర్‌రెడ్డిని కోరారు. అదేవిధంగా ఏపీలో ప్ర‌పంచ సామ‌ర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని `జ‌డ్ స్కాల‌ర్` సీఈవో చౌద‌రిని కోరారు. క్వాంట‌మ్ కంప్యూటింగ్‌లో ప‌రిశోధ‌నా రంగంలో చేతులు క‌ల‌పాల‌ని `సేల్స్ ఫోర్స్` ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ ను కోరారు. ఇలా.. ప‌లువురు పెట్టుబ‌డి దారుల‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయి పెట్టుబ‌డుల‌పై చ‌ర్చించారు.

ఎవ‌రెవ‌రితో బేటీ అంటే..

+ ఐటీ మౌలిక సదుపాయాలపై `ఓప్స్ ర్యాంప్` సీఈవో వర్మతో భేటీ.
+ అమరావతిలో డిజైన్, ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని `ఆటో డెస్క్` చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్‌తో చ‌ర్చ‌లు
+ ఎలక్ట్రోలైజర్ తయారీ ప‌రిశ్రమ ఏర్పాటుకు `రిగెట్టి కంప్యూటింగ్` సీటీవో డేవిడ్ రివాస్‌తో లోకేష్ చ‌ర్చించారు.

This post was last modified on December 9, 2025 7:08 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Lokesh

Recent Posts

నేరస్తులకు షాకిచ్చేలా ఏపీ పోలీసుల సరికొత్త పోలీసింగ్

కరుడుగట్టిన నేరస్తులకు దిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వటమే కాదు.. తమకు ఎదురు లేదు.. తిరుగులేదన్నట్లుగా వ్యవహరిస్తూ.. అచ్చొచ్చిన అంబోతుల మాదిరి…

15 minutes ago

సినీ పరిశ్రమకు సీఎం బంపర్ ఆఫర్

ఫ్యూచ‌ర్ సిటీలో సినీ స్టూడియోల నిర్మాణానికి ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తుంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నిర్మాత‌లు ఎవ‌రైనా.. ఎక్క‌డి…

51 minutes ago

వైసీపీ… జాతీయ మీడియా జపం..?

జాతీయ మీడియాపై వైసీపీకి అకస్మాత్తుగా ప్రేమ ఉప్పొంగిపోయింది. జాతీయ మీడియాలో వచ్చే పలు క్లిప్పింగులను వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లలో…

3 hours ago

బీఆర్ఎస్ పార్టీపై మరో సంచలన ట్వీట్ చేసిన కవిత

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీపై మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.…

4 hours ago

జయశ్రీగా తమన్నా… ఎవరు ఈవిడ ?

స్పెషల్ సాంగ్స్ లో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్న తమన్నా చాలా గ్యాప్ తర్వాత ఛాలెంజింగ్ రోల్ ఒకటి దక్కించుకుంది.…

6 hours ago

అఖండ-2 రిలీజ్… అభిమానులే గెలిచారు

గత గురువారం మరి కొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రిమయర్స్ పడాల్సి ఉండగా.. అనూహ్యంగా అఖండ-2 సినిమాకు బ్రేక్…

6 hours ago