తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చే 2047 నాటికి 3(30 లక్షల కోట్ల రూపాయలు) ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి నిర్దేశిత లక్ష్యాలను పొందుపరుచుకున్నామన్నారు. ముఖ్యంగా అభివృద్ధి దూసుకుపోతున్న విదేశీ నగరాలను ప్రామాణికంగా తీసుకుని.. వాటిని అనుసరిస్తున్నామని చెప్పారు. వీటిలోనూ ప్రధానంగా చైనాలోని `గ్వాంగ్ డాంగ్`.. రాష్ట్రం అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆ రాష్ట్రం కేవలం 20 ఏళ్లలో భారీ పెట్టుబడులు సాధించిందని సీఎం వివరించారు. అలానే తెలంగాణను కూడా పెట్టుబడులకు డెస్టినేషన్‌గా మార్చనున్నట్టు చెప్పారు.
తాజాగా రెండు రోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సదస్సును రంగారెడ్డి జిల్లాలోని మీర్‌ఖాన్ పూర్‌లో ఉన్న ఫ్యూచర్ సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ.. తెలంగాణ లక్ష్యాలను వివరించారు. 2047 నాటికి దేశం ఏవిధంగా అయితే.. లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగుతోందో.. అలానే తెలంగాణ కూడా నిర్దేశిత లక్ష్యాలతో ముందుకు సాగుతుందని చెప్పారు. దీనిలో భాగంగానే వచ్చే మూడేళ్లలోనే 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని చెప్పారు.
అదేవిధంగా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ లక్ష్య సాధనలో అందరినీ కలుపుకొని పోనున్నట్టు సీఎం వివరించారు. పారిశ్రామిక వేత్తలు, ఆర్థిక వేత్తలు తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10శాతం ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ముఖ్యమంత్రి వివరించారు. అయితే.. ఇదేమీ చిన్నలక్ష్యం కాదన్న ఆయన.. కష్టపడి సాధించాలని భావించినప్పుడు పెద్ద పెద్ద లక్ష్యాలనే నిర్దేశించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రజల సహకారంతో లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన చెప్పారు.
రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించినట్టు సీఎం చెప్పారు. అభివృద్ధి మరింత క్షేత్రస్థాయికి చేరాలన్న లక్ష్యంతోనే రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించినట్టు తెలిపారు. ఈ మూడు జోన్లను ఇతర రంగాలకు సమన్వయం చేయడం ద్వారా.. క్యూర్, ప్యూర్, రేర్ ఫార్ములతో వాటిని అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు. వీటిని క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా పిలవనున్నట్టు తెలిపారు. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రం సాధించిన ప్రగతిని స్వయంగా చూసినట్టు తెలిపిన సీఎం .. తెలంగాణలోనూ అదే తరహా ఫార్ములాతో పెట్టుబడులను ఆహ్వానించి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు. ఇదేసమయంలో ప్రపంచంలో అభివృద్ధి సాధించిన జపాన్, జర్మనీ సహా ఇతర దేశాలను కూడా నమూనాలుగా తీసుకుంటామన్నారు.
This post was last modified on December 9, 2025 7:55 am
టాలీవుడ్లో అత్యంత పొడవైన హీరోల లిస్టు తీస్తే.. అందులో రెబల్ స్టార్ ప్రభాస్ పేరే ముందు చెప్పుకోవాలన్నది వాస్తవం. టాలీవుడ్…
కాంగ్రెస్ అగ్రనేతే కాదు.. లోక్‌సభలో విపక్ష నాయకుడు కూడా అయిన రాహుల్‌గాంధీ.. తరచుగా తప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఎప్పటికప్పుడు…
2009లో విడుదలైన బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఒక సంచలనం. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని కాలేజీ స్టూడెంట్…
వైసీపీ మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల…
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
టీడీపీ ఎంపీ, గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో రాష్ట్రంలోని 25…