ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. వీరి కష్టాలు తీర్చేందుకు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న టీడీపీ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. విమాన యాన సంస్థలతో భేటీ అవుతున్నారు. ఇండిగో పరిస్థితులపై చర్చిస్తున్నారు. మరోవైపు.. ప్రయాణికులకు రుసుములు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. ఇంకో వైపు రాజ్యసభలోనూ ఆయన ప్రతిపక్షాలు అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం లేదని, ప్రయాణికుల ఇబ్బందులను గమనించి ఏర్పాట్లు చేస్తున్నామని రామ్మోహన్ చెప్పారు. అంతేకాదు.. ఇండిగో సంస్థపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సంస్థ అంతర్గత వ్యవహారాల్లో చోటు చేసుకున్న లోటుపాట్ల కారణంగానే ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌లో చోటు చేసుకున్న లోపాలపై ఇప్పటికే విచారణకు ఆదేశించామన్నారు. ఇలా.. అటు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడం.. మరోవైపు.. ఇండిగో విమానాల రాకపోకలు, విమానాశ్రయాల్లో చోటు చేసుకున్న పరిణామాలను నిరంతరం ఆయన పర్యవేక్షిస్తున్నారు.
ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా స్పందించారు. మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదురైందని.. అయినా.. ఎంతో సమర్థవంతంగా దీనిని పరిష్కరిస్తున్నారని రామ్మోహన్‌ను ప్రధాని ప్రశంసించారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వారికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా.. సమయ స్ఫూర్తిగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు.
విమానయాన శాఖాపరంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నారని కితాబిచ్చారు. ఇదేసమయంలో ఆయన కీలక సూచన కూడా చేశారు. విపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. “మీరు చేయాలని అనుకున్న పనిని నిర్విఘ్నంగా చేయండి. ఎవరో ఏదో అన్నారని మనసులో పెట్టుకోవద్దు. ప్రజల కోసం పనిచేసేప్పుడు.. అనేక మంది అనేకం అంటారు. వాటిని అసలు మనసులోకి తీసుకోవద్దు. గో ఎహెడ్“ అని ప్రధాని పేర్కొన్నారు.
This post was last modified on December 8, 2025 10:21 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…