తెలంగాణలో తిరుగులేనట్లుగా ఉన్న కాంగ్రెస్ తాజా పరిస్థితి ఎలా ఉందన్న విషయం తెలిసిందే. చేతిలో ఉన్న అధికారం చేజారి ఆరేళ్లు దాటిన తర్వాత కూడా అంతర్గత కుమ్ములాటలే తప్పించి.. చేజారిన పవర్ ను చేజిక్కించుకోవాలన్న కసి కాంగ్రెస్ నేతల్లో ఏ మాత్రం కనిపించకపోవటం తెలిసిందే. వరుస అపజయాలు.. ఆ మాటకు వస్తే.. దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ ఉనికి సైతం ప్రశ్నార్థకంగా మారిన దుస్థితి. ఇలాంటివేళ.. టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త రథసారధిని ఎంపిక చేసే విషయంపై కాంగ్రెస్ అధినాయకత్వం సీరియస్ గా ఆలోచిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పార్టీ చీఫ్ పదవికి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని ఎంపిక చేసేందుకు అంతా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే.. రేవంత్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు పలువురు.. ఆయన్ను ఎంపిక చేయొద్దంటూ భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొన్నీమధ్యనే అర్థరాత్రి వేళ.. కొందరు నేతలు హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో రహస్య భేటీ నిర్వహించారు.
ఆ భేటీ ఎజెండా.. రేవంత్ ను టీపీసీసీ చీఫ్ కాకుండా అడ్డుకోవటమే. రేవంత్ కు పోటీగా ఎవరిని తమ అభ్యర్థిగా పార్టీకి చెప్పాలన్న చర్చ తర్వాత.. మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు తెర మీదకు వచ్చింది. సౌమ్యుడిగా.. వివాదరహితుడిగా ఉన్న ఆయన్నుకానీ పీసీసీ చీఫ్ కుర్చీలో కూర్చోబెడితే.. పార్టీలో ఎలాంటి అధిపత్య పోరు ఉండవన్న విషయాన్ని పార్టీ నాయకత్వానికి చెప్పినట్లుగా సమాచారం. దీంతో.. నిన్నటి వరకు రేవంత్ కు పార్టీ చీఫ్ కుర్చీని అప్పజెప్పేందుకు సిద్దమైన పార్టీ.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆలోచనలో పడినట్లుగా చెబుతున్నారు.
ఈ వాదనకు బలం చేకూరేలా కొన్ని అంశాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. శ్రీధర్ బాబుకు కానీ టీపీసీసీ చీఫ్ పదవిని అప్పజెబితే.. తమకు ఓకే అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. జగ్గారెడ్డితో పాటు.. మరికొందరు నేతలు కూడా సానుకూలత వ్యక్తం చేయటంతో రేవంత్ కు అవకాశాలు తగ్గినట్లుగా చెబుతున్నారు. వైఎస్ హయాంలోనూ.. తర్వాతి రోశయ్య.. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో మంత్రిగా వ్యవహరించిన శ్రీధర్ బాబు అయితేనే పార్టీకి మేలు కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో.. రేవంత్ కు బదులుగా శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కే అవకాశం ఉందంటున్నారు. ఈ అంచనాలే నిజమైతే.. ఫైర్ బ్రాండ్ కు సౌమ్యుడు షాకిచ్చినట్లుగా చెప్పక తప్పదు.
This post was last modified on December 7, 2020 12:29 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…