కోటి విద్యలు కూటి కొరకే.. అన్నట్టుగా కోటి సంతకాలు సేకరించి.. ఏపీలో వైద్య కాలేజీలను రాజకీయంగా తనవైపు తిప్పుకోవాలని భావించిన వైసీపీకి సంతకాల మాటేమో కానీ.. కోటి తిప్పలు మాత్రం తప్పడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్‌షిప్(పీపీపీ) విధానంలో అభివృద్ది చేయాలని నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వంపై భారం పడకుండా వాటిని పూర్తి చేయడంతోపాటు, ప్రజలకు మరింత మెరుగైన వైద్య శాలలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
వాస్తవానికి వైసీపీ హయాంలోనే కేంద్రం దేశవ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి అనుమతి ఇచ్చింది. అప్పట్లో తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంతో కయ్యం పెట్టుకున్న నేపథ్యంలో ఈ రాష్ట్రం మినహా..దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఈ వైద్య కళాశాలలు మంజూరయ్యాయి. ఇలా.. ఏపీకి 17 కొత్త మెడికల్ కాలేజీలు దక్కాయి. వీటిలో జగన్ హయాంలో 5 మెడికల్ కాలేజీలు 80 శాతం మేరకు నిర్మాణం పూర్తయ్యాయి. మిగిలిన 12 కాలేజీల్లో మరో మూడు 70 శాతం పనులు జరిగాయి. మిగిలి వాటిలో మాత్రం అసలు పనులు ముందుకు సాగలేదు. ఇవి చేపట్టాలంటే.. 8 వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉందని కూటమి లెక్కలు తేల్చింది.
ఈ నేపథ్యంలోనే వాటిని పీపీపీ విధానంలో అబివృద్ధి చేయాలని నిర్ణయించింది. కానీ, దీనికి వైసీపీ వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది.రాష్ట్ర వ్యాప్తంగా ఒక దశ ఉద్యమం కూడా నిర్వహించింది. ఇదేసమయంలో కోటి సంతకాలు సేకరించి.. గవర్నర్‌ను కలిసి.. ఆయనద్వారా ప్రభుత్వాన్ని ఈ పీపీపీ విధానం నుంచి తప్పించేలా చేయాలన్నది వైసీపీ ప్లాన్. ఈ క్రమంలో రెండు మాసాల కిందటే ఈ కోటి సంతకాల సేకరణకు మొగ్గు చూపారు. కానీ, ఇది ముందుకు సాగడం లేదు. ఒకే మండలంలో 50 వేల సంతకాలు చేయించడం.. ఒకే నియోజకవర్గంలో 2 లక్షల సంతకాలు తీసుకోవడం వంటివి జగన్ దృష్టికి రావడంతో దానిని రద్దు చేశారు.
దీనిలో ఏదో మతలబు ఉందని స్వయంగా జగనే గ్రహించి దానిని ఆపేశారు. ఆ తర్వాత మళ్లీ ఫ్రెష్‌గా సంతకాలు చేయించాలని జగన్ నాయకులను ఆదేశించారు. కానీ,ఇది కూడా ముందుకు సాగడం లేదు. తుఫాన్లు, వరదలు, రైతుల ఇబ్బందులు.. పంటల నష్టం, ఇలా..వివిధ అంశాలు తెరమీదికి రావడంతో ప్రజల నుంచి పెద్దగా ఈ వ్యవహారంపై స్పందన కనిపించలేదు. దీంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కోటి తప్పలు పడుతోంది. మరోవైపు.. గవర్నర్ అప్పాయింట్‌మెంటును కోరి.. ఇప్పటికి రెండు సార్లు రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంతకాల సేకరణ అయ్యేదెప్పుడు? గవర్నర్‌ను కలిసేదెప్పుడు? అనేది వైసీపీకి కూడా అంతుచిక్కడం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 2, 2025 4:10 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…