Political News

విశాఖ‌లో మిర్రర్ బ్రిడ్జి, ఎన్ని అడుగుల ఎత్తో తెలుసా?

విశాఖ‌ప‌ట్నానికి పెట్టుబ‌డులు, ఐటీ సంస్థ‌ల రాక‌తో ఇప్పటికే భారీ మైలేజీ వ‌చ్చింది. గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటు కానున్న నేప‌థ్యంలో ఈ న‌గ‌రం ఇప్పుడు ప్ర‌పంచ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఎక్క‌డ విన్నా.. విశాఖ పేరు వినిపిస్తోంది. ఏ న‌లుగురు క‌లుసుకున్నా.. విశాఖ అభివృద్ధి, పెట్టుబ‌డులు, ఐటీ రాజ‌ధాని, ఆర్థిక రాజ‌ధానిగా పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం కూడా పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ న‌గ‌రం అభివృద్ది శ‌ర వేగంగా ముందుకు సాగుతోంది. త‌ద్వారా ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు మెండుగా ల‌భించ‌నున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప‌ర్యాట‌క రంగానికి కూడా విశాఖ‌ను కేంద్రంగా మార్చేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో భాగంగానే రుషి కొండ‌పై వైసీపీ హ‌యాంలో నిర్మించిన భారీ భ‌వంతిని ప‌ర్యాట‌క కేంద్రంగా మార్చేందుకు మంత‌నాలు చేస్తున్నారు. దీనిపై ప్ర‌త్యేకంగా సూచ‌న‌లు చేసేందుకు, స‌ల‌హాలు ఇచ్చేందుకు క‌మిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇక‌, ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వ‌ర‌కు సుమారు 50 కిలో మీట‌ర్ల దూరాన్ని ప‌ర్యాట‌క తీర ప్రాంత కారిడార్‌గా మారుస్తున్నారు. ఇప్ప‌టికే బ‌స్సు టూరిజం పేరుతో అన్ని మౌలిక స‌దుపాయాల‌తో రెండు బ‌స్సుల‌ను గ‌త నెల‌లో సీఎం చంద్ర‌బాబు ప్రారంభించారు.

ఈ ప‌రంప‌ర‌లో తాజాగా మిర్ర‌ర్ టూరిజం పేరుతో మ‌రో స‌రికొత్త సొబ‌గు.. విశాఖ‌శిగ‌లో చేరింది. విశాఖ‌లోని ప్ర‌ఖ్యాత కైలాస‌గిరిపై ఏర్పాటు చేసిన ఈ మిర్ర‌ర్ టూరిజంలో `స్కైవాక్‌` పేరుతో చేసిన ఏర్పాట్లు ప్ర‌పంచ స్థాయి ప‌ర్యాట‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటాయ‌ని రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ చెబుతోంది. తాజాగా ఈ ప్రాజెక్టును విశాఖ ఎంపీ భ‌ర‌త్ ప్రారంభించారు. ఇది దేశంలోనే అత్యంత పొడవైన `గ్లాస్ స్కై వాక్‌`గా ప‌ర్యాట‌క శాఖ పేర్కొంది. దీనికి ముందు చైనాలో నిర్మించిన అతి పెద్ద గ్లాస్ స్కైవాక్ త‌ర్వాత‌.. విశాఖ రెండో స్థానంలో ఉంద‌ని వివ‌రించింది. దీనిని పీపీపీ విధానంలో అభివృద్ది చేశారు.

స్కైవాక్ బ్రిడ్జ్ డైమ‌న్ష‌న్లు ఇవీ..

కైలాస గిరిపై నిర్మించిన మిర్ర‌ర్ స్కైవాక్ బ్రిడ్జిని వైసీపీ హ‌యాంలోనే ప్రారంభించారు. అయితే.. మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. దీనిని కొన‌సాగించింది. దీనికి గాను సుమారు 7 కోట్ల రూపాయ‌లను ఖ‌ర్చు చేశారు. ఇది.. 500 ట‌న్నుల బ‌రువును మోయ‌గ‌ల‌దు. ఒకేసారి 40 మంది ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తిస్తారు. వారు ఈ బ్రిడ్జిపై ఎగిరినా.. ప‌రుగులు పెట్టినా త‌ట్టుకునే సామ‌ర్థ్యంతో దీనిని నిర్మించ‌డం విశేషం. ఈ బ్రిడ్జి మొత్తం పొడ‌వు.. 55 మీట‌ర్లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. ఇది విశాఖ స‌ముద్ర మ‌ట్టానికి 862 అడుగుల ఎత్తుతో ఉంటుంద‌ని.. ప‌ర్యాట‌కుల‌కు కొత్త అనుభూతిని మిగుల్చుతుంద‌ని వివరించారు.

Kumar

Recent Posts

ఓజి… పెద్ది… విశ్వంభర ఏదీ

గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…

7 minutes ago

బాలకృష్ణ లైనప్ స్పష్టంగా ఉంది

సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…

16 minutes ago

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

1 hour ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

2 hours ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

7 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

7 hours ago