Political News

H-1B వీసాలు రద్దు చేస్తే అమెరికాకే నష్టం: ఎలాన్ మస్క్

అమెరికాలో ఉద్యోగం చేయాలనేది ప్రతి భారతీయ టెక్కీ కల. కానీ మారుతున్న నిబంధనలు, ట్రంప్ సర్కార్ ఆంక్షలతో ఆ కల చెదిరిపోతుందేమో అనే భయం అందరిలో ఉంది. సరిగ్గా ఈ సమయంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు భారతీయ టెక్కీలకు పెద్ద ఊరటనిచ్చాయి. జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మస్క్, H-1B వీసాల ఆవశ్యకత గురించి కుండబద్దలు కొట్టారు. ఈ ప్రోగ్రామ్‌ను రద్దు చేస్తే నష్టపోయేది భారతీయులు కాదు, అమెరికానే అని ఆయన తేల్చి చెప్పారు.

అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులు లాక్కుంటున్నారనే వాదనను మస్క్ కొట్టిపారేశారు. అసలు అమెరికాలో టాలెంట్ ఉన్న వాళ్ల కొరత చాలా ఉందని, తమ కంపెనీల్లో క్లిష్టమైన పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం లేదని ఆయన వాపోయారు. “మాకు తెలివైన వాళ్లు కావాలి, వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు” అని స్పష్టం చేశారు. H-1B వీసాలు రద్దు చేయాలనే ఆలోచన చాలా ప్రమాదకరమని, అది అమెరికా అభివృద్ధికి గొడ్డలి పెట్టు లాంటిదని హెచ్చరించారు.

అయితే, H-1B విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని మస్క్ ఒప్పుకున్నారు. కొన్ని అవుట్‌సోర్సింగ్ కంపెనీలు సిస్టమ్‌లోని లొసుగులను అడ్డుపెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నాయని అన్నారు. ఆ మోసాలను అరికట్టాలే తప్ప, మొత్తం వీసా విధానాన్ని రద్దు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. స్కిల్డ్ వర్కర్లు లేకపోతే చిప్స్, మిసైల్స్ వంటి కాంప్లెక్స్ టెక్నాలజీని అమెరికాలో డెవలప్ చేయడం కష్టమని ట్రంప్ కూడా రియలైజ్ అయ్యారని గుర్తు చేశారు.

బైడెన్ హయాంలో సరిహద్దు భద్రత గాలిలో దీపంలా మారిందని మస్క్ విమర్శించారు. అక్రమ వలసలను అడ్డుకోవడానికి బోర్డర్ కంట్రోల్స్ కచ్చితంగా ఉండాలని, లేకపోతే అది దేశమే కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చట్టబద్ధంగా H-1Bతో వచ్చే టాలెంటెడ్ వ్యక్తులకు, అక్రమంగా వచ్చే వారికి మధ్య తేడా ఉందని, టాలెంట్‌కు ఎప్పుడూ రెడ్ కార్పెట్ ఉండాలని ఆయన సూచించారు. గణాంకాలు చూస్తే.. గతేడాది జారీ అయిన H-1B వీసాల్లో 71 శాతం భారతీయులకే దక్కాయి. అంటే అమెరికా టెక్ రంగానికి భారతీయ మేధాశక్తే ఎక్కువగా అవసరం ఉంది. మస్క్ లాంటి గ్లోబల్ ఐకాన్ ఇలా మద్దతుగా నిలవడం టాలెంటెడ్ టెక్కీలకు కొండంత ధైర్యమని చెప్పవచ్చు.

This post was last modified on December 1, 2025 11:06 am

Share

Recent Posts

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

2 minutes ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

28 minutes ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

56 minutes ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

1 hour ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

2 hours ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago