ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీలోని కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కొబ్బరి రైతులను కలుసుకున్నారు. వాస్తవానికి కోనసీమ అంటేనే ‘ఏపీ కేరళ’గా గుర్తింపు ఉంది. దీనికి కారణం కొబ్బరి తోటలే. ఇక్కడ నుంచి వచ్చే ఉత్పత్తి దేశవ్యాప్తంగా రవాణా అవుతుంది. అయితే.. రైతులను కలుసుకున్న పవన్ కల్యాణ్.. వారి సమస్యలు విన్నారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాల రైతుల గోడును ఆలకించారు.
ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజనకు -కోనసీమ కొబ్బరికి లింకు ఉందన్నారు. “నాటి రాష్ట్ర విభజనకు కోనసీమ కొబ్బరి కూడా ఒక కారణం” అని వ్యాఖ్యానించారు. దీనికి రీజనేంటి? ఎందుకు కారణమైంది? అనేది ఆయన వివరించలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? విషయం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. రాజకీయ విశ్లేషకులు దీనికి 2 కారణాలు చెబుతున్నారు.
1) ఉమ్మడి తూర్పుగోదావరికి చెందిన పలువురు.. హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. వీరు ఆర్ధికంగా, రాజకీయంగా కూడా(అప్పట్లో) చక్రం తిప్పుతున్నారు. మరోవైపు సినీ దర్శకులు, నటులు కూడా ఎక్కువగానే ఉండేవారు. దీంతో ‘ఏపీ వాళ్లు’, ‘సెటిలర్లు’ మన సొమ్ము తినేస్తున్నారు. మనకు హక్కులు, అవకాశాలు లేకుండా చేస్తున్నారన్న వాదన తెరమీదికి వచ్చింది. అయితే.. ఇది ఒక్కటే తెలంగాణ ఉద్యమానికి రీజన్ కాకపోవచ్చు. కానీ.. పవన్ ఉద్దేశంలో కోనసీమ, తూర్పు ప్రాంతాలు కారణమై ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు.
2) ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అప్పట్లో అతి పెద్ద జిల్లా. దీనికి ప్రధాన ఆదాయం కోనసీమ కొబ్బరి. అదే విధంగా రైస్ మిల్లులు. ఈ రెండు అంశాలు ఆర్థికంగా ప్రభావం చూపించాయి. ఏపీకి వస్తున్న ఆదాయంలో ఈ రెండు కీ రోల్ పోషించాయి. నాటి తెలంగాణ ఉద్యమానికి ఏపీ ఆదాయాన్ని చూపించే క్రమంలో కోనసీమ ప్రాంతం కూడా కీలక పాత్ర పోషించి ఉంటుందన్న కోణంలోనూ పవన్ వ్యాఖ్యానించి ఉంటారన్న వాదన ఉంది.
ఇక, ఆయన ఉద్దేశం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు అప్పట్లో రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించారు. వాస్తవానికి అప్పటి రాజమండ్రి ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభజనను వ్యతిరేకించినా.. మరికొందరు పారిశ్రామిక వేత్తలు మాత్రం దీనికి మద్దతు ఇచ్చారన్న వాదన ఉంది. బహుశ పవన్ ఉద్దేశంలో తూర్పు గోదావరి(ప్రస్తుతం మెజారిటీ ప్రాంతం కోనసీమ జిల్లాలో ఉంది) ప్రాంతం రాష్ట్ర విభజనకు దోహదపడి ఉంటుందన్న వాదన విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.
This post was last modified on November 27, 2025 10:15 am
అమెరికా వీసా (H-1B, H-4) కోసం అప్లై చేసేవారికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇకపై ఇంటర్వ్యూకి వెళ్లేముందు సర్టిఫికెట్లు సరిచూసుకోవడమే…
దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకపక్క రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90 దాటి పాతాళానికి…
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…