వరదలొచ్చినా.. విపత్తులొచ్చినా.. జనాలకు ఇంకే కష్టం వచ్చినా.. విరాళాలు ప్రకటించే వాళ్లలో సినిమా వాళ్లు ముందుంటారు. ఆ సమయంలో జనాల దృష్టి కూడా వాళ్ల మీదే ఉంటుంది. సినిమాల ద్వారా కోట్లు సంపాదించే హీరోలు ఎవరు ఎంత విరాళం ప్రకటించారని చూస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమై ఫిలిం సెలబ్రెటీలను నెటిజన్లు నిలదీసేస్తుంటారు కూడా. ఎవరెంత ఇచ్చారన్న దాన్ని బట్టి వాళ్ల వ్యక్తిత్వాన్ని కూడా నిర్దేశిస్తుంటారు.
ఐతే ఆయా సమయాల్లో మిగతా రంగాల ప్రముఖుల స్పందన ఎలా ఉందన్నది మాత్రం ఎవరూ పట్టించుకోరు. వందలు, వేల కోట్లు సంపాదించే రాజకీయ, వ్యాపార దిగ్గజాల గురించి అడిగేవాళ్లు ఎవరూ ఉండరు. వాళ్లలో చాలామంది ఒక్క రూపాయి కూడా విదల్చరు. ముఖ్యంగా రాజకీయ నాయకులైతే విరాళాలు ప్రకటించిన దాఖలాలే కనిపించవు. ఎన్నికల సమయాల్లో తప్పితే వాళ్ల నుంచి రూపాయి బయటికి రాదు.
ఇదే విషయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఓ సందర్భంలో ప్రస్తావించాడు. తాజాగా ఆయన ఆంధ్రా ప్రాంతంలో వరదల ధాటికి దెబ్బ తిన్న రైతులను పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఓ విలేకరి పవన్‌ను ఓ ప్రశ్న అడిగాడు. వరద వల్ల దెబ్బ తిన్న రైతులకు మీరు ఏం సాయం చేస్తున్నారు అని అడిగాడు.
దీనికి పవన్ బదులిస్తూ.. ‘‘ఈ ప్రశ్న నన్ను బాగానే అడిగారు. నా తరఫున, పార్టీ తరఫున ఏం జరగాలో అది జరుగుతుంది. మేం ఏం చేయగలమో అంతా చేస్తాం. కానీ ఇదే మాట మీరు అందరు రాజకీయ నాయకులనూ అడగాలి. ఎన్నికల కోసం వాళ్లు 30 కోట్లు.. 50 కోట్లు.. 150 కోట్లు.. ఇలా ఖర్చు చేస్తున్నారు. వందల కోట్లు సంపాదిస్తున్నారు. అందులో కొంత మొత్తం తీసి వరద బాధితులను ఆదుకోవచ్చు కదా. ఎప్పుడైనా వాళ్లు ఇలాంటి పరిస్థితుల్లో విరాళాలు ఇచ్చారా? దీని గురించి మీరు ఇంతే ధైర్యంగా రాజకీయ నాయకులను ప్రశ్నించాలి’’ అని పవన్ అన్నాడు. జనసేన అధినేత ప్రశ్న నూటికి నూరు శాతం సమంజసం. ఇలాంటి సందర్భాల్లో అందరి దృష్టీ సినిమా వాళ్ల మీద పడుతుంది తప్ప రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారన్నది ఎవ్వరూ పట్టించుకోరు.
This post was last modified on December 4, 2020 12:38 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…