Political News

జ‌గ‌నే… నన్ను దూరం పెట్టాడు: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్ సోద‌రి, ప్ర‌స్తుతం ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలిగా ఉన్న వైఎస్ ష‌ర్మిల‌.. మ‌రోసారి త‌న అన్న‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను జ‌గ‌న్‌కు దూరం కాలేద‌ని.. జ‌గ‌నే త‌న‌ను, త‌న త‌ల్లిని కూడా దూరం పెట్టాడ‌ని ఆమె అన్నారు. “ఎవ‌రు చెప్పారు.. జ‌గ‌న్‌కు నేను దూరంగా ఉన్నాన‌ని?” అని ఆమె ప్ర‌శ్నించారు. అంతేకాదు..”జ‌గ‌న్ ఎప్పుడు అడిగినా.. నేను రాజ‌కీయంగానే కాదు.. కుటుంబ ప‌రంగా కూడా అండ‌గా ఉన్నా.” అని తెలిపారు. కానీ, ఆయ‌నే రాజ‌కీయంగా త‌న‌ను దూరం పెట్టార‌ని అన్నారు. ఆస్తుల వివాదాల సృష్టి కూడా ఆయ‌నదేన‌ని చెప్పారు.

తాజాగా విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడిన ష‌ర్మిల‌.. జ‌గ‌న్‌పై స్పందించారు. అన్న‌గా జ‌గ‌న్ అంటే ఇప్ప‌టికీ అభిమాన‌మేనని చెప్పారు. ఆయ‌న అడిగిన వెంట‌నే 3 వేల కిలోమీట‌ర్ల దూరాన్ని కూడా అల‌వోక‌గా పాద‌యాత్ర చేశాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే పార్టీ నిల‌బ‌డింద‌న్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాలా? అని ఎదురు ప్ర‌శ్నించారు. ఇంత చేసినా.. త‌న‌ను ఆయ‌నే గుర్తించ‌లేద‌న్నారు. తాను స్వ‌యంగా జ‌గ‌న్‌ను వ‌దిలేయ‌లేద‌ని.. జ‌గ‌నే త‌న‌ను వ‌దిలేశార‌ని.. బంధాన్నికూడా బ‌ద్నాం చేశాడ‌ని అన్నా రు. దీంతో త‌న దారి తాను చూసుకున్నాన‌ని ష‌ర్మిల తెలిపారు.

“నేను పార్టీ పెట్టుకున్నా. నీకు(జ‌గ‌న్‌) ఇబ్బంది లేదు. అయినా.. పార్టీని కూడా వేధించేలా వార్త‌లు రాయించారు. ఇది త‌గునా? అని అన్నందుకు సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. బీఆర్ఎస్‌తో క‌లిసి.. న‌న్ను అరెస్టు చేయించారు.” అని ఆనాటి సంగ‌తులను ష‌ర్మిల గుర్తు చేసుకున్నారు. అన్న‌గా త‌న పాత్ర‌ను జ‌గ‌న్ మ‌రిచిపోయినా.. సోద‌రిగా తాను మాత్రం ఎప్పుడూ జ‌గ‌న్‌కు అండ‌గా ఉన్నాన‌ని చెప్పారు. విశ్వాసం అనేది ఎవ‌రో ఇస్తే వ‌చ్చేది కాద‌న్న ష‌ర్మిల‌.. అది మ‌న‌సులో ఉండాల‌న్నారు. కానీ, అది లేదు కాబట్టే.. నా దారి నేను చూసుకున్నాన‌ని వెల్ల‌డించారు.

“జ‌గ‌న్ జైల్లో ఉన్న‌ప్పుడు.. ఎలాంటి ప‌రిస్థితి ఉందో తెలుసుక‌దా?. అప్ప‌ట్లో వైసీపీ నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. అయినా.. నేను కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని పాద‌యాత్ర చేశా? నిజంగా నాకు అంత స్టామినా ఉంటుంద‌ని అనుకోలేదు. కానీ, అన్న‌గా ఆయ‌న‌కు అండ‌గా ఉండాల‌ని భావించిన‌ప్పుడు.. న‌న్ను నేను మ‌లుచుకున్నా. ” అని ష‌ర్మిల వివ‌రించారు. ఇక‌, ఆస్తుల వివాదం కూడా తాను సృష్టించింద‌ని ప్ర‌చారం చేశార‌ని.. కానీ, దీనిలోనూ వాస్త‌వం లేద‌ని.. ఇంత‌క‌న్నా ఏమీ చెప్ప‌లేన‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

This post was last modified on November 20, 2025 8:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

11 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago