Political News

10వ సారి సీఎం కుర్చీ.. కానీ ఆ ‘పవర్’ ఎవరి చేతిలో?

బీహార్ రాజకీయాల్లో “నితీష్ కుమార్” అంటేనే ఒక రికార్డు. ముఖ్యమంత్రి కుర్చీ మారదు, కూటములు మాత్రమే మారుతుంటాయి అనే పేరున్న ఆయన, ఇప్పుడు మరో చరిత్ర సృష్టించబోతున్నారు. అక్షరాలా 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అయ్యారు. ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో, ఈరోజు (బుధవారం) ఆయన తన పదవికి రాజీనామా చేసి, మళ్లీ రేపు (గురువారం) కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇది భారత రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం.

ఈసారి ఎన్నికల ఫలితాలు ఎన్డీయేకి పండగలాంటివే. మొత్తం 243 సీట్లలో ఏకంగా 202 సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కూటమిలో నితీష్ పార్టీ (JDU) కంటే బీజేపీనే ‘పెద్దన్న’గా అవతరించింది. బీజేపీకి 89 సీట్లు వస్తే, జేడీయూ 85 సీట్లకే పరిమితమైంది. ఇక చిరాగ్ పాశ్వాన్ పార్టీ 19 సీట్లతో తన సత్తా చాటగా, మాంఝీ, కుష్వాహ పార్టీలు కూడా తమ వంతు పాత్ర పోషించాయి. సంఖ్యాబలం బీజేపీకి ఎక్కువ ఉన్నా, ఇచ్చిన మాట ప్రకారం నితీషే మళ్లీ కింగ్ కాబోతున్నారు.

పైకి అంతా బాగున్నట్టే కనిపిస్తున్నా, తెర వెనుక మాత్రం పదవుల పంపకంపై గట్టి యుద్ధమే నడుస్తోంది. ముఖ్యంగా ‘హోం శాఖ’ ఎవరికి అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. ఎప్పటి నుంచో ఈ శాఖను తన దగ్గరే పెట్టుకుంటున్న నితీష్, ఈసారి కూడా వదులుకోవడానికి రెడీగా లేరు. కానీ, ఎక్కువ సీట్లు గెలిచిన బీజేపీ మాత్రం ఈసారి కీలక శాఖలతో పాటు, ‘స్పీకర్’ పదవి కూడా తమకే కావాలని పట్టుబడుతోంది. ప్రమాణ స్వీకారానికి ఒక్క రోజు ముందే ఈ బేరసారాలు తారాస్థాయికి చేరాయి.

ఈ రాజకీయ చదరంగం ఎలా ఉన్నా, వేడుక మాత్రం గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. పాట్నాలోని గాంధీ మైదాన్ ఇందుకు వేదిక కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ విజయాన్ని దేశవ్యాప్తంగా ఒక పెద్ద పొలిటికల్ స్టేట్‌మెంట్‌గా చూపించాలని ఎన్డీయే భావిస్తోంది. రేపు ఉదయం జరిగే ఈ వేడుక కోసం భారీ సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు.

ఈరోజు ఎన్డీయే ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో సమావేశమై నితీష్‌ను తమ నాయకుడిగా అధికారికంగా ఎన్నుకుంటారు. ఆ వెంటనే గవర్నర్‌ను కలిసి పాత ప్రభుత్వానికి రాజీనామా చేసి, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు క్లెయిమ్ చేస్తారు. కొత్త కేబినెట్‌లో బీజేపీ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 14 మంది మంత్రులుగా ప్రమాణం చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి బీహార్‌లో మళ్లీ నితీష్ మార్క్ రాజకీయం మొదలైందన్నమాట.

This post was last modified on November 19, 2025 12:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

7 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

8 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

8 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

9 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

10 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

11 hours ago