సినిమా వాళ్లకు రాజకీయం ఎందుకు అన్న వాళ్ల నోళ్లు మూయిస్తూ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయి సంచలనం సృష్టించారు ఎన్టీ రామారావు. అదే సమయంలో అటు తమిళనాడులోనూ రాజకీయాల్లో సినిమా వాళ్ల ఆధిపత్యం మొదలైంది. అక్కడ సినీ రంగం నుంచి వచ్చి ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత ముఖ్యమంత్రి పీఠాలను అధిష్టించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ తదనంతరం రాజకీయాల్లో సినిమా వాళ్ల ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది కానీ.. తమిళనాట మాత్రం సినీ-రాజకీయ నేతల ఆధిపత్యం కొనసాగింది.
ఎన్టీఆర్ చనిపోయాక ఒక పుష్కర కాలానికి మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి జనాదరణ సంపాదించుకున్న మెగాస్టార్.. ఎన్టీఆర్ రికార్డును బద్దలు కొడుతూ ఇంకా తక్కువ సమయంలో పార్టీ పెట్టి సీఎం అయిపోవాలనుకున్నారు. కానీ రోజులు బాగా మారిపోయిన పరిస్థితుల్లో ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. తొలి ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల తర్వాత చిరు కాస్తయినా ఓపిక పట్టలేకపోయారు. రెండేళ్లు తిరిగేసరికి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. చిరు దెబ్బకు మళ్లీ ఏ సినీ హీరో కూడా పెద్ద లక్ష్యాలతో రాజకీయాల్లోకి రాలేని పరిస్థితి తలెత్తింది. ఈ ప్రభావం పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన మీద బాగానే పడింది. ఆయన వ్యక్తిగత వైఫల్యం కూడా తోడై జనసేనకు గత ఎన్నికల్లో దారుణమైన ఫలితాలొచ్చాయి. ఈ దెబ్బతో తెలుగునాట సినిమా రాజకీయాలకు దాదాపు తెరపడినట్లయింది. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఏమైనా కథ మారుస్తాడేమో చూడాలి.
తమిళనాట రాజకీయాల విషయానికి వస్తే.. జయలలిత, కరుణానిధిల మరణంతో అక్కడ రాజకీయ శూన్యత నెలకొందని, ఇలాంటి సమయంలో రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు బరిలోకి దిగితే సులువుగా అధికారం చేపట్టవచ్చని అంచనా వేశారు. ఐతే వీళ్లిద్దరూ నిరాశ పరిచారు. ఇద్దరూ కలిసి ఎన్నికలకు రెండు మూడేళ్లు ముందు ఉమ్మడిగా పార్టీ మొదలుపెట్టి బలమైన కార్యాచరణతో రంగంలోకి దిగితే బాగుండేదేమో. కానీ అలా ఏమీ జరగలేదు.
కమల్ సొంతంగా పార్టీ పెట్టాడు. ఆయన ప్రభావం ఇప్పటి వరకు అయితే అంతంతమాత్రంగానే ఉంది. రజినీ మీద ఆశలు పెట్టుకుంటే ఆయన మరింతగా నిరాశ పరిచారు. పార్టీని ప్రకటించడానికే ఆయన చాలా సమయం తీసుకున్నారు. ఆయన నాన్చుడు ధోరణితో జనాలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇప్పుడు పార్టీ ప్రకటన గురించి సంకేతాలిచ్చినా పెద్దగా స్పందన లేదు. రాబోయే ఎన్నికల్లో కమల్ కానీ, రజినీ కానీ పెద్దగా ప్రభావం చూపిస్తారన్న అంచనాలైతే పెద్దగా లేవు. చూస్తుంటే తమిళనాట కూడా తెలుగు రాష్ట్రాల పరిస్థితులే పునరావృతం అవుతాయేమో అనిపిస్తోంది.
This post was last modified on December 3, 2020 10:11 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…