గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందా? కొన్ని పార్టీ లు వ్యూహాత్మకంగా పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రచార పర్వం ముగిసింది. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ జరగనుంది. అయితే.. ఈ నేపథ్యంలో ఎవరు గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుంటారు? అనే చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి.. ఒకవైపు ఎవరి ఊహలు, ఎవరి అంచనాలు, ఎవరి విశ్లేషణలు వారికి ఉన్నాయి.
గత ఎన్నికలకు భిన్నంగా సాగిన ప్రచారం.. బీజేపీ నుంచి కీలక నేతలు రావడం వంటివి తమకు అనుకూ లంగా ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇక, బీజేపీ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని.. తాము చేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలు తమకు గెలుపు గుర్రాన్ని అందిస్తాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. సరే! ఇదొక భాగం. అయితే.. ఇప్పుడు మరో కీలక విషయం చర్చకు వస్తోంది. అదేంటంటే.. ఓటింగ్ శాతం పెంచడం! గ్రేటర్‌లో ఓటింగ్ శాతం పెరిగేలా బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.
గత 2016 ఎన్నికల్లో 45.27 శాతం పోలింగ్ నమోదైంది. అప్పట్లో టీఆర్ఎస్‌కు 99, మజ్లిస్‌కు 44, బీజేపీకి నాలుగు, కాంగ్రెస్‌కు రెండు వార్డులు దక్కాయి. అయితే.. ఇప్పుడు పోలింగ్ శాతాన్ని పెంచేలా బీజేపీ నేతలు సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే.. సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా.. తటస్థ ఓటరు పెద్దగా బయటకు రారు. అన్ని పార్టీలూ ఇంతే! అనే ధోరణిలోనే ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న మధ్యతరగతి, ఉన్నతస్థాయి వర్గాలు.. ఓటింగుకు దూరంగా ఉంటాయి.
ఇప్పుడు ఇలాంటి వారిని టార్గెట్ చేయడం ద్వారా.. తమకు అనుకూలంగా ఓట్లు పోటెత్తేలా చేసుకోవాలని .. బీజేపీ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు.. సుమారు 57-62 శాతం వరకు పోలింగ్ జరుగుతుందని అంటున్నారు. ఇదే జరిగితే.. పెరిగిన ఓట్లన్నీ తమకు అనుకూలంగా పడేవేనని బీజేపీ నేతలు అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. అయితే.. పోలింగ్ పెరిగినంత మాత్రాన ప్రభుత్వ వ్యతిరేక ఓటే కానవసరం లేదని.. టీఆర్ ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా.. గ్రేటర్ ఫైట్ చిత్రాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో.. చూడాలి.
This post was last modified on December 1, 2020 10:17 am
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…