గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికలు హీట్ పెంచేస్తున్నాయి. గెలుపు కోసం అధికార టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. ఈ పరిస్ధితుల్లో కాంగ్రెస్ గురించి కానీ లేకపోతే టీడీపీ గురించి కానీ అసలు పట్టించుకునే వాళ్ళే లేకుండాపోయారు. తమ గురించి ఎవరు పట్టించుకోకపోయినా ఆ రెండు పార్టీలు మరెందుకు పోటీ చేస్తున్నాయి ? ఎందుకంటే కేవలం ఉనికి కోసమనే చెప్పాలి. నిజానికి టీడీపీ గనుక గట్టి ప్రతిపక్షంగా ఉండుంటే కనీసం ఇపుడు గ్రేటర్ పరిధిలో అయినా మంచి ప్రభావం చూపేదనటంలో సందేహం లేదు.
గ్రేటర్ పరిధిలోనే ఎందుకంటే 150 డివిజన్లలో కనీసం తక్కువలో తక్కువ 40 డివిజన్లలో సీమాంధ్రుల ప్రభావం చాలా ఎక్కువగా ఉందన్నది అందరికీ తెలిసిందే. గ్రేటర్ పరిధిలో సీమాంధ్రుల ఓట్లు సమారు 35 లక్షలున్నాయని అంచనా. నల్లకుంట, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, నిజాంపేట, కొంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, ఓల్డ్ బోయినపల్లి, ఉప్పల్, వనస్ధలిపురం, బాచుపల్లి, మియాపూర్, జీడిమెట్ల, లింగంపల్లి, పఠాన్ చెఱువు లాంటి అనేక ప్రాంతాల్లో సీమాంధ్రులదే డామినేషన్.
సీమాంధ్రుల్లో కూడా కచ్చితంగా చెప్పాలంటే కమ్మ సామాజికవర్గానికిదే మెజారిటి. అయితే ఇపుడు వీళ్ళంతా ఏమి చేస్తారు ? అన్నదే పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సీమాంధ్రుల ఓట్లలో టీడీపీకి ఎన్ని పడతాయన్నది అనుమానమే. అందుకనే ఈ ఓట్లన్నింటినీ బీజేపీకి మళ్ళించాలని చంద్రబాబునాయుడు పరోక్షంగా కొందరు తన సామాజికవర్గం ప్రముఖులతో చెప్పారనే ప్రచారం జోరందుకుంది. అయితే చంద్రబాబు చెప్పినంత మాత్రాన బీజేపీకి ఓట్లు పడతాయా ? అన్నదే అనుమానంగా మారింది.
ఎందుకంటే మేయర్ పీఠాన్ని బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఎవరిలోను లేదు. ఒకవేళ గ్రేటర్ లో కమలంపార్టీనే పై చేయి సాధించినా రాష్ట్రప్రభుత్వాన్ని కాదని చేయగలిగేది ఏమీ లేదన్నది అందరికీ తెలిసిందే. ఈమాత్రం దానికి టీఆర్ఎస్ ను కాదని బీజేపీ కి ఓట్లేసి జరిగే ఉపయోగం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. పైగా సీమాంధ్రులే తమను ఓడించారనే మంట అధికార టీఆర్ఎస్ లో మొదలైతే భవిష్యత్తులో చాలా నష్టాటుంటాయి.
ఇదే గనుక జరిగితే సీమాంధ్రులపై అధికార పార్టీ నేతలు కక్ష పెంచుకునే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను చూస్తే ఇది సీమాంధ్రులకు తీరని నష్టం జరుగుతుందని చాలామంది గ్రహించారు. అందుకనే చంద్రబాబు చెప్పినా కమ్మ సామాజికవర్గంలో కూడా బీజేపీకి ఓట్లు పడేది అనుమానమే అంటున్నారు. మరలాంటపుడు ఓట్లు ఎవరికి వేస్తారు ? ఎవరికంటే ముందు అభ్యర్ధులను చూసి తర్వాత తమ ఓటు ఎవరికో డిసైడ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. చూద్దాం ఏ విషయం డిసెంబర్ 4వ తేదీ తేలిపోతుంది కదా.
This post was last modified on November 30, 2020 4:37 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…